వేములవాడ పట్టణ పోలింగ్ బూత్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీలు వారియర్స్ తో బోయినపల్లి వినోద్ కుమార్ సమావేశం

వేములవాడ పట్టణ పోలింగ్ బూత్ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీలు వారియర్స్ తో బోయినపల్లి వినోద్ కుమార్ సమావేశం

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వ్యూహాల పై సూచనలు చేసిన వినోద్ కుమార్

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వేములవాడ పట్టణ పోలింగ్ బూత్ స్థాయి బీ ఆర్ ఎస్ పార్టీ కమిటీ ఇన్చార్జిలు వారియర్స్ తో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మంగళవారం సమావేశమయ్యారు.

మంగళవారం వేములవాడ పట్టణంలోని అసెంబ్లీ ఎన్నికల బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మేడ లక్ష్మీ నరసింహారావు ఎన్నికల కార్యాలయంలో వేములవాడ పట్టణ పోలింగ్ బూత్ స్థాయి ఇన్చార్జీలు వారియర్స్ తో పోలింగ్ సమయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, అమలు చేయాల్సిన విధివిధానాలు, గురుతర బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి అన్న అంశాలను వినోద్ కుమార్ వివరించి చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు సవివరంగా వివరించాలని వినోద్ కుమార్ పోలింగ్ వారియర్స్ కు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు మరోసారి గుర్తుచేయాలని వినోద్ కుమార్ పోలింగ్ వారియర్స్ కు సూచించారు.

పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సాగిన ఉద్యమ, ప్రభుత్వ పాలన, సాధించిన విజయాలు, ఇంకా సాధించాల్సి ఉన్న అంశాలను వినోద్ కుమార్ సుదీర్ఘంగా వివరించారు.

పోలింగ్ బూత్ లలో వారియర్స్ అప్రమత్తంగా ఉండాలని, ఆయా పోలింగ్ బూత్ ల పరిధిలో ఉన్న ఓటర్స్ అందరూ ఓటు హక్కు వినియోగించుకునేల ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ఓట్లు బీ ఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా పడేలా చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ వారియర్స్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ మాధవీ రాజు, పోలింగ్ బూత్ ఇంచార్జీలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version