వరికోల్ గ్రామంలో వి.సి.పి.సి కమిటీ
నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని వరికోల్ గ్రామంలో వి.సి.పి.సి (విలేజ్ చైల్డ్ ప్రొటెక్ట్ కమిటీ) బాలల పరిరక్షణ కమిటీ వేయడం జరిగింది.జీరో నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎలాంటి సమస్యలు కుటుంబ పరంగా గాని, సమాజపరంగాని,శారీరక, మానసిక ఇబ్బందులు వచ్చినప్పుడు వి.సి.పి.సి కమిటీ పరిష్కరిస్తుంది. బాలలకు టోల్ ఫ్రీ నెంబర్ 1098 ఈ నంబరు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడును.ఈ కార్యక్రమానికి బాలల సంరక్షణ కమిటీ మెంబర్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,గ్రామ కార్యదర్శి సాంబశివరావు, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాస్,హెడ్మాస్టర్,స్కూల్ యాజమాన్యం బాలల సంరక్షణ కమిటీ మెంబర్ దామోదర్ ఐ.సి.పి.సి.ఓ లు సుజాత,1098 రజిత కౌన్సిలర్, ఏఎన్ఎం ఆశా వర్కర్స్,అంగన్వాడీ టీచర్స్, కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.అలాగే బేబి పడావో బేటి బచావో జిల్లా మహిళా సాధికారిక కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ కళ్యాణి,మానస జండర్ స్పెషలిస్ట్,అంగన్వాడీ టీచర్స్ డీ.పూలరాణి, బి. సుమలత, పి.రజిత,వి. సుజాత,జి.రజిత తదితరులు పాల్గొన్నారు.
