ఏ ఐ ఫ్ డి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున
హన్మకొండ, నేటిధాత్రి:
వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్ ఓ కె.శ్రీనివాస్ కి అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగడ్డంనాగార్జున
మాట్లాడుతూ…..వరంగల్ జిల్లా కరీమాబాద్ ఎస్ ఆర్ ఆర్ తోట ప్రాంతం లోని వాణి విద్యానికేతన్ లో నాలుగో తరగతి చదువుతున్న కీర్తన అనే విద్యార్థిని ని మార్చి 16వ తేదీన పి ఇ టి నరేష్ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఏఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో స్థానీక ఎంఈఓ విజయ్ కుమార్ గారికి వినతిపత్రం ఇవ్వగా వారు స్పందించి వెంటనే ఎంక్వయిరీ చేయగా వాణి విద్యానికేతన్ స్కూలుకు ఒక పర్మిషన్ మాత్రమే ఉంది కానీ ఒక పర్మిషన్ తో రెండు పాఠశాలలను నడిపిస్తున్నారని ఆ ఎంక్వైరీలో తేలింది. ఆ రిపోర్టును వరంగల్ డిఈఓ గారికి ఇవ్వడం జరిగింది. డి.ఈ.ఓ గారికి యం ఈ ఓ రిపోర్ట్ ప్రకారం స్కూల్ సీజ్ చేసే పర్మిషన్ రద్దు చేసే అధికారాలు ఉన్నప్పటికీ వారు 18-3- 2024 రోజున ఆర్జెడి గారికి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది ఎంఈఓ గారు ఇచ్చిన రిపోర్టు మరియు డీఈఓ గారు ఇచ్చిన లేఖ ప్రకారం తక్షణమే ఆ స్కూల్ పర్మిషన్ రద్దుచేసి సీజ్ చేసే అధికారం ఆర్జెడి గారికి ఉన్నది అయినా వారు అధికారం అడ్డుపెట్టుకొని వడప్సా సంఘానికి కొమ్ముకాస్తూ లోపాయి కార ఓప్పందాలు చేసుకొని స్కూల్ యాజమాన్యం యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని 23-3-2024 రోజున డిఈవో గారికి లేఖ పంపడం సిగ్గుచేటు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎంఈఓ గారి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా స్కూల్ పర్మిషన్ రద్దుచేసి సీజ్ చేయాలని అదేవిధంగా నిర్లక్ష్యం వహించినటువంటి ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి గారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని తల్లిదండ్రులను మోసం చేస్తూ పర్మిషన్ లేకుండా ఉన్నట్లుగా చెప్పి అక్రమంగా స్కూల్ నడిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాల్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల సాయికుమార్ కమిటీ సభ్యులు మాగాని సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.