భద్రాచలం నేటి రాత్రి
స్థానిక టీఎన్జీవో భవనం నందు భద్రాచలం బీసీ బాలుర వసతి గృహం HWO గద్దల నరసింహారావు గారికి ఆత్మీయ సమ్మేళన వేదిక ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు జిలకర నాగరాజు, బాసి పోగు శ్రీనివాస్, మజ్జూ రి వాసు, మడిపల్లి వెంకటేశ్వర్లు, ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనం వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా అలవాల రాజా పెరియర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా అలవాల గౌర్రజు, ఈటే రాజేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, అరికెళ్ల తిరుపతిరావు మరియు విశిష్ట అతిథులు డాక్టర్ భాను ప్రసాద్, డాక్టరు ఉదయ్, డాక్టర్ సుమన్ ప్రవీణ్, డాక్టర్ కిరణ్, దీపంగి రమణయ్య, భీమపాక పెదరాజు, రాయల రాములు, ముద్ద పిచ్చయ్య, గురుజల వెంకటేశ్వర్లు, ముదిగుండ్ల వేణు, రావులపల్లి ఈశ్వరయ్య , బాల నర్సారెడ్డి గార్లు శాలువతో సత్కరించి మాట్లాడుతూ…… 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా గారి చేతుల మీదుగా భద్రాచలం బీసీ బాలుర వసతిగృహం వెల్ఫేర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న గద్దల నరసింహారావు గారు ఉత్తమ సేవా అవార్డు గ్రహీత అవార్డు అందుకోవడం సంతోషించ దగ్గ విషయమని, చిన్నప్పటినుండి ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదురిస్తూ ఉద్యోగ బాధ్యతలు చేపట్టి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత గద్దల నరసింహారావు గారిని ఉన్నారు. హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు ఉన్నత అవకాశాలపై అవగాహన కల్పిస్తూ, విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తు ఎందరు మారుమూల ప్రాంత విద్యార్థులకు విద్య అవకాశాలు కల్పించిన విద్యాదాత అని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యా అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తమ హాస్టల్లో అవకాశం కల్పించి తోడ్పాటినందించిన స్నేహసిలి అని అన్నారు. ఉత్తమ సేవ అవార్డు రావడం విద్యార్థుల పట్ల ప్రేమ, ఆప్యాయత, ఉద్యోగం పట్ల తనకున్న నిబద్ధత, శ్రమ వల్లేనని అన్నారు. గతంలో అనేకసార్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు పొందిన ఘనత గద్దల నరసింహారావు గారికి దక్కుతుందని అన్నారు. అనగారిని కులాల విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న మనసున్న మహా మనిషి అని అన్నారు. గద్దల నరసింహారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగస్తులు పయనించాలని, గద్దల నరసింహారావు గారు మరెన్నో అవార్డులు తీసుకొని ఉన్నత శిఖరాలను, ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నామని వారు అన్నారు. అనంతరం గద్దల నరసింహారావు భార్యమని బూబమ్మగార్లకు ఆత్మీయ సమ్మేళనం వేదిక నిర్వాహకులు జిలకర నాగరాజు, వాసిపోగు శ్రీనివాసు, మజ్జూరి వాసు, మడిపల్లి వెంకటేశ్వర్లు పూలదండ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమం మెజీషియన్ అలవాల తిరుపతి తన ఇంద్రజాలంతో సబికులను అలరించడం, విజ్ఞానవంతమైన ప్రదర్శన చేయడం జరిగింది.ఇనపల్లివెంకట్, గడ్డం స్వామి, వెంకట రామారావు,ఇసంపల్లి రాజా, వెంకట్, ఇంటి మధు,కొప్పుల రాంబాబు, కొమ్మగిరి వెంకటేశ్వర్లు కోట ప్రభాకర్, ప్రకాష్, రాంబాబు ,శివ, సమ్మక్క, వాణి, దుర్గాప్రసాద్, నాగరాజు, కిషోర్ వేణు, వెంకన్న, శంకర్, చంటి, కిరణ్, ప్రకాష్ ,నరేష్, తదితరులు పాల్గొన్నారు