పోతే..పోన్రీ!?

`ఎవరిని బెదిరిస్తారు!

`జనం కోసం సినిమాలు తీస్తున్నారా!

`ప్రేక్షకులు సినిమా లేకపోతే బతకలేమంటున్నారా!

`వచ్చిన దారినే వెళ్లిపోండి!

`తెలంగాణ సినిమా వస్తుంది.

`తెలంగాణ యాసకు పూర్వ వైభవం వస్తుంది.

`తెలంగాణ యాసకు మళ్లీ జీవం వస్తుంది.

`పూర్తి తెలంగాణ మాండలికం కళకళలాడుతుంది.

`ఇప్పటికీ పూర్తి తెలంగాణ యాసలో సినిమాలు రావడం లేదు.

`కొంత వచ్చినా తెలంగాణ యాసను కించపరిచే విధంగానే వుంటున్నాయి.

`తెలంగాణలో కొన్ని వేల మంది కళాకారులున్నారు.

`అద్భుతమైన రచనా సంపత్తి కలిగిన వాళ్లున్నారు.

`మట్టి పరిమళాలు వెదజల్లే కవులున్నారు.

`తెలంగాణ చరిత్రను ఖండాంతరాలు దాటించే చారిత్రక సినిమాలు తీస్తారు.

`తెలంగాణ ఉద్యమ కాలాన్ని సినిమాలలో బంధిస్తారు.

`తరతరాలకు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అందించే వారున్నారు.

`పాన్‌ ఇండియా హీరోలు తెలంగాణ నుంచి తయారౌతారు.

`నైజాం మార్కెట్‌ నుంచి సూపర్‌ స్టార్‌, మెగాస్టార్‌ లు వస్తారు?

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:                        నా వల్లే ప్రాబ్లమౌతుందనుకుంటే నేను వెళ్లిపోతా..అంటూ ఇటీవల ఓ సినిమాలో పాపులర్‌ అయిన డైలాగ్‌. సినిమా మొత్తం ఆ డైలాగ్‌ను అనేకసార్లు ఆ పాత్ర దారుడు చెబుతుంటాడు. సినిమా పూర్తయ్యే వరకు వుంటాడు. అలాగే తెలంగాణ నుంచి మేం వెళ్లిపోతామంటూ కొందరు సినీ పెద్దలు పదే పదే అంటున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి నిజమా? కాదా? అన్నది తెలియదు. కాని నిప్పులేనిదే పొగరాదు. ఎక్కడో అక్కడ ఆంద్రా ప్రాంతానికి చెందిన సినీపెద్దలు అనకపోతే వార్త బైటకే రాదు. సరే..అంటున్నారనే అనుకుందాం? వాళ్లను తెలంగాణలో వుండమని ఎవరంటున్నారు? అనుకుంటూ ఎందుకుంటున్నారు? ఎవరు రమ్మంటే వచ్చారు? ఎవరు వెళ్లమంటే వెళ్తామంటున్నారు? సినీ పెద్దలు తెలంగాణ వుండి ఎవరిని ఉద్దరించారు? ఎవరికి కోసం సినిమాలు తీస్తున్నారు. తెలంగాణ ప్రజలు అయ్యా మీరు సినిమా తీయకపోతే మేం బతకలేమంటున్నారా? అసలు సినిమా పరిశ్రమలో వున్న తెలంగాణ ప్రజలు ఎంత? సినిమాలలో తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ హీరోలు ఎంత మంది? తెలంగాణ దర్శకులెంతమంది? తెలంగాణ నిర్మాతలు కూడా ఆంద్రా హీరోలతోనే సినిమాలు తీస్తుంటే..మేం పోతాం..మేం వెళ్తామని వార్తలు వస్తుంటే? ఎవరు ఆగమంటున్నారు? తెరమీద వేషాలు వేస్తున్నారు. సరే..నిజ జీవితంలోనైనా సరే నటించకుండా వుండండి. తెరమీద నటించి, బైట నటిస్తే పరిస్దితి ఇలాగే వుంటుంది. అసలు ప్రపంచమే సినిమా చూడాలనుకోవడం లేదు. సినిమా చూసే ఓపికలు కూడా ప్రేక్షకులకు. ఒకప్పుడు సినిమా మాత్రమే వినోదం. ఇప్పుడు అరచేతిలోకి అనేక రకాలైన వినోదాలు వచ్చాయి. పెద్ద పెద్ద హీరోకంటే గొప్పగా రియల్‌ హీరోలు అనిపించుకునే వారు మన కళ్ల ముందు కనిపిస్తున్నారు. ఇంకా డూప్‌ హీరోలు ఎందుకు? వారికి స్టార్లు అనే బిరుదులెందుకు? అసలు వారితో సినిమాలెందుకు? మేం వెళ్లిపోతామనే మాటలు నిజమే అయితే తెలంగాణకు పట్టిన అసలైన సినీ దరిద్రం పోతుంది. ఇది ముమ్మాటికీ నిజం. ఏపి హీరోలైనా తెలంగాణ కలెక్షన్లమీదే ఆదారపడి బతుకుతున్నారు. తెలంగాణలో వచ్చే ఆదాయంతోనే కోట్లు కూడబెట్టుకుంటున్నారు. రూపాయి పెట్టుబడి పెట్టి, తెలంగాణ వసూళ్లతోనే కోట్లు సంపాదించుకుంటున్నారు. అయినా కృతజ్ఞత వారిలో లేదు. తెలంగాణ దర్శకులకు అవకాశాల్విరు. తెలంగాణ నటులకు ప్రోత్సాహమివ్వరు. కనీసం స్టూడియో గేటు కూడా దాటన్విరు. అలాంటి ఆంద్రా నిర్మాతలు, దర్శకులు, నటులు తెలంగాణకు అవసరం లేదు. సినిమాలు తీసే నిర్మాతలు ఫ్యాషన్‌ అనే మాటను పదే పదే వాడుతుంటారు. ప్యాషన్‌ కాదు..దాని వెనక వున్న సంపాదన కోసం ఎగబడుతున్నారు. హీరోలకు కోట్లు కోట్లు కుమ్మరిస్తున్నారు. కోట్లు అప్పులు చేసి సినిమాలు తీస్తున్నారు. పెట్టిన పెట్టుబడిలో రూపాయికి పదింతలు రాకపోతే సినిమాలు ఎవరైనా తీస్తారా? కోట్ల రూపాయలు పోగొట్టుకొని వీధినపడాలనుకుంటారా? తెలంగాణ ధియేటర్లను కూడా గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణ సినిమాను నాశనం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని సర్వనాశనం చేశారు. ఇంకా సరిపోలేదా? ఇంకా తెలంగాణ మీద అక్కసు తగ్గలేదు. తెలంగాణ తిండి తింటూ, తెలంగాణ మీదే విషం చిమ్మే సినిమా పరిశ్రమ వుంటే ఎంత? లేకుంటే ఎంత? 60 ఏళ్లు తెలంగాణలో కలిసి వున్నారు. ఏనాడైనా తెలంగాణ సాయుధ పోరాటాన్ని పెద్ద పెద్ద హీరోలు చేశారా? తెలంగాణ ఉద్యమ ప్రస్తానంపై సినిమాలు తీశారా? అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లు నిటించారా? అసలు కొన్నిదశాబ్ధాలుగా తెలంగాణలో వుంటున్నా, తెలంగాణ యాస రాదు. తెలంగాణ బాష మీద పట్టులేదు. తెలంగాణలో కూడా సీమాంద్ర యాసను జొప్పించే కుట్రలు చేశారు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకడం లేదు. తెలంగాణలో వస్తున్న మట్టి పరిమాళాలైనటు వంటి పాటలు వస్తుంటే సీమాంద్ర సినీ పెద్దలు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణలో ఇప్పుడు యువతరం ఉరకలెత్తిస్తున్న పాటలను చూసి జడుసుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ యాసలో పాటలు వస్తే హేళన చేశారు. ఇప్పుడు తెలంగాణ డిజే పాటలతో ప్రపంచమంతా దద్దరిల్లుతోంది. హీరోల వెకిలిపాటలు చూడడానికి , వినడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే తెలంగాణ నుంచి వెళ్లిపోవడమే మేలనుకుంటున్నారు. హాయిగా వెళ్లిపోండి. తెలంగాణలోకి ఆంద్రా సినిమా రాకముందే తెలంగాణలో గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఏపి సినిమాకు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు రాకముందే తెలంగాణ దర్శకుడికి వచ్చింది. తెలంగాణకు ఏపి సినీ గద్దలు వచ్చి, సర్వనాశనం చేశారు. తెలంగాణ సినిమాకు తావు లేకుండా చేశారు. తెలంగాణ సినిమాను హైజాక్‌ చేశారు. తెలంగాణలోనే తెలంగాణసినిమా బతకకుండా చేశారు. దుర్మార్గులై తెలంగాణ సంస్కృతిని చంపేసేంత దుర్మార్గం చేశారు. అల్లూరి సీతారామ రాజు సినిమాను తీసేందుకు ఎగబడ్డారు. ఒకరిని కాదని ఒకరు పోటీ పడి సినిమాలు నిర్మించారు. సర్ధార్‌ పాపారాయుడు తీశారు. తాండ్ర పాపారాయుడు తీశారు. ఇలా ఆఖరుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తెలంగాణ వచ్చిన తర్వాత తీశారు. కాని ఏనాడు తెలంగాణ సర్వాయి పాపన్న సినిమా ఎందుకో చిరంజీవి తీయలేదు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో సినిమాలు ఎందుకు చేయలేదు. ఇప్పటికీ సందు దొరికితే ఆంద్రాకు చెందిన వారి సినిమాలు తీసే ప్రయత్నం చేస్తారు..తప్ప తెలంగాణ యాసను మాట్లాడానికి కూడా మనసు రాదు. తెలంగాణ యాసను గేలి చేయకుండా నోరు మెదపలేరు. అందుకే తెలంగాణ సమాజం ఆంద్రా హీరోలు గోబ్యాక్‌ అంటే తప్ప కదలరు. మీకు మీరుగా వెళ్లిపోతామంటే ఎవరూ వద్దనే వారు లేరు. తెలుగు సినిమా గొడుగు వెళ్లిపోతే, తెలంగాణ సౌధంలాంటి సినిమాలు వస్తాయి. వందలమంది తెలంగాణ హీరోలు వస్తారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు వస్తాయి. తక్కువ ధరకు సినిమా అందుబాటులోకి వస్తుంది. తెలంగాణ యాసలో వున్న కమ్మదనమైనా తెలంగాణ వ్యాప్తంగా ఊరేగుతుంది. తెలంగాణ అంటే ఇదిరా అనే సినిమాలు వస్తాయి. బతుకమ్మ గొప్పదనం ప్రపంచానికి తెలిసే అవకాశం వస్తుంది. తెలంగాణ పల్లె సంస్కృతి వెల్లివిరుస్తుంది. తెలంగాణ పల్లెలో బోనాల పండుగ ప్రపంచానికి తెలుస్తుంది. తెలంగాణగ్రామీణ దేవతల సినిమాలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చెట్టు, పుట్ట మీద కూడా సినిమాలు వస్తాయి. తెలంగాణలో మాండలికం కళకళలాడుతుంది. కళాకారులకు గుర్తింపు వస్తుంది. తెలంగాణ వచ్చిందే కళాకారులు చేత..ఆ కళాకారులు సినిమాలు తీసే స్ధాయికి ఎదుగుతారు. మర్రి చెట్టుల్లా పాతుకుపోయిన ఏపి సినీ గద్దలను కాదని స్వేచ్చగా సినిమాలు తీస్తారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడుస్తున్నా సినిమా అంతా పూర్తి స్దాయి తెలంగాణ యాసలో సినిమాలు తీయరు. ఆ మధ్య చిరంజీవి నటించిన వీరయ్య సినిమాలో చిరంజీవి శ్రీకాకుళం యాసలో మాట్లాడతారు. అదే సినిమాలో రవితేజకు తెలంగాణ యాసను జోడిస్తారు. ఇదెలా సాధ్యమౌతుంది. అంటే తెలంగాణ మీద దాడికి ఇదో రకమైన పన్నాగమన్నమాట. ఈ మధ్య తెలంగాణ యాసలో వస్తున్న పాటలను విని, అందులో ఏమైనా అర్ధముందా? అని ఆంద్రా రచయితలు అంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అసలు తెలంగాణ బాష తెలియని వెధవలకు, అర్ధాలు ఎలా తెలుస్తాయి? ఎందుకంటే ఇంకా తెలంగాణయాసను నేర్చుకోలేని దుర్మార్గుల సినిమాలు తెలంగాణ ప్రజలు కూడా చూడొద్దు. దేశమంతా హిందీ నేర్చుకోవాలంటున్నారు. మరి తెలంగాణలో వుండి తెలంగాణ భాష ఎందుకు నేర్చుకోవడం లేదు. అంటే తెలంగాణ బాష అంటే అంత చిన్న చూపా? దారి పొండ వత్తుండు..దవ్వదవ్వ వత్తుండు..దారిద్దునా..పోనిద్దునా..అంటూ పొడి పొడి మడికట్టు పదాల అందాలు అశ్లీలం తప్ప ఆరోగ్యకమైన మాటలు లేని ఏపి యాసను ఇంత కాలం తెలంగాణ సహించడమే పొరపాటైంది. అందుకే తెలుగు సినిమాపేరుతో పాతుకుపోయిన సినీ గద్దలు పోతేనే తెలంగాణకు సగం శని పోతుంది. తెలంగాణ సినిమా జాతీయ అంతర్జాతీయంగా ఎదుగుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version