# వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పినట్లే జరుగుతుందా…
#వింతగా చూస్తున్న పనికిర చుట్టూ పక్క గ్రామల ప్రజలు
# నెక్కొండ, నేటి ధాత్రి:సృష్టిలో ఒక్కొక్క మారు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అందులో భాగంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఫనికర గ్రామంలో ఆదివారం విచిత్ర సంఘటన చోటుచేసుకుంది దేసు లక్ష్మణ్ ఇంట్లో మందార చెట్టుకు ఎరుపు రంగు, గోధుమ రంగు తో రెండు పూలు ఓకే కొమ్మకు పూయడంతో గ్రామస్తులు వింతగా చెట్టును చూశారు. విచిత్రం ఏమిటంటే ఆ చెట్టు నిత్యం గోధుమ రంగు పూలే పూస్తుంది. ఈరోజు ఎర్రని మందార పువ్వు పూయడంతో ఇది దేనికి సంకేతమొ అర్థం కాక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఓకీంత ఆందోళనలో ఉన్నారు. మందార చెట్టు పరిసరాలలో వేరే రంగుతో ఉన్న మందార చెట్టు కూడా లేదు ఈ విచిత్ర సంఘటన వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా కలియుగంలో కొన్ని వింతలు సంభవించ నున్నాయని తెలిపారని అందులో ఇది కూడా ఒకటిగా భావిస్తున్న ప్రజలు.