జమ్మికుంట:నేటిధాత్రి
శ్రీ విద్యారణ ఆవాస విద్యాలయానికి ‘ సోలార్ ప్లాంట్ ని’ మంజూరు చేస్తానన్న కేంద్ర మంత్రి
జమ్మికుంట పట్టణంలోని కేశవపురంలో శ్రీ విద్యారణ ఆవాస విద్యాలయం విద్యాలయం గత 47 సంవత్సరాలుగా విలువలతో కూడుకున్న విద్యను అందిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, విద్యార్థులకు శారీరకంగా, మానసికంగా ధైర్యాన్ని అందిస్తూ, దేశ సంరక్షణకై శిక్షణ ఇస్తున్న సంస్థ శ్రీ విద్యారణ ఆవాస విద్యాలయం అని, అలాంటి సంస్థకు తక్షణమే “సోలార్ ప్లాంట్” కు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తేల రాజమౌళి గారు, ప్రబంధకారిణి అధ్యక్షులు ముక్క జితేందర్ గుప్తా, ఉపాధ్యక్షులు ఆకుల రాజయ్య, ప్రధాన ఆచార్యులు పొలసాని సుధాకర్ రావు, శ్రీ సరస్వతి శిశు మందిర్ సమితి కార్యదర్శి ఆకుల రాజేందర్, ప్రబంధకారిణి అధ్యక్షులు శీలం శ్రీనివాస్, మరియు సంపెల్లి సంపత్ రావు తదితరులు కలిశారు