జర్నలిస్టు సమ్మయ్యను టీఎస్‌జేయూ నేతల పరామర్శ
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ సమ్మయ్యను తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జేయూ)నాయకులు శుక్రవారం పరామర్శించారు.ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకుని గాంధీనగర్‌లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న సమ్మయ్యను నేతలు కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.సమ్మయ్యను పరామర్శించిన వారిలో టీఎస్‌జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షుడు గట్టు రవీందర్ తదితరులు ఉన్నారు.
