10 వ వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్
ఘనంగా ముగ్గుల పోటీలు.విజేతలకు నగదు బహుమతులు అందజేత.
నర్సంపేట,నేటిధాత్రి:
తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిరూపం ముగ్గుల రంగుల అల్లికలు
నర్సంపేట పట్టణ 10 వ వార్డు కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ అన్నారు. 10వ వార్డు పరిదిలోని వరగంల్ రోడ్ లోని స్వామి వివేకానంద కాలనీలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండడానికి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద కాలనీ సంక్షేమ సంఘం వారు భోగి మంటలతో పాటు ముగ్గుల పోటీలను స్థానిక గీతాంజలి హైస్కూల్లో నిర్వహించడం జరిగిందన్నారు. నర్సంపేటకు ఆదర్శంగా సమిష్టి కృషితో ముందుకు సాగాలని వార్డు ప్రజలకు తెలియజేశారు.ముగ్గుల పోటీ కార్యక్రమంలో మొదటి బహుమతి గెలుపొందిన దేవులపల్లి మౌనిక 3116,రెండవ బహుమతి రూ.2116 పరాచికపు స్రవంతి , మూడో బహుమతి అరిగల సృజన రూ.1116 గెలుపొందారు.అలాగే ఆరుగురికి రూ. 516 రూపాయల చొప్పున కన్సోలేషన్ బహుమతులు, పోటీలోపాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతి అందజేశారు. ఇవ్వనైనది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు మేడవరపు కమలాకర్ రావు, గీతాంజలి స్కూల్ చైర్మన్ సుబ్బారావు, కాలని ప్రధాన కార్యదర్శి దార గణేష్, కోశాధికారి పాసికంటి రమేష్,ముగ్గుల పోటీ కన్వీనర్ మోత ఇంద్రసేనారెడ్డి, కో కన్వీనర్ ఎండి రాయబోసు,అలువాల బిక్షపతి, రాజు, దేవులపెల్లి సతీశ్, పెండెం భాస్కర్, కుమారస్వామి పారాచికపు సదానందం కాలనీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.