నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ వడ్డెర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బొంత మురళి ఎన్నిక అయ్యారు.హైదరాబాద్ లోని గల రవీంద్ర భారతిలో స్వతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించారు.అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు సమ్మయ్య ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా మురళిని ఎన్నుకొన్నారు. ఎన్నిక అయిన మురళిని రాష్ట్ర ఎమ్ బిసి కార్పొరేషన్ చైర్మన్ జరిపాటి జైపాల్ చేతుల సన్మానించారు.అలాగే ఒడ్డెర ఓబన్న అవార్డ్ అందుకున్నారు.ముఖ్య అతిధులుగా టీపీసీసీ అద్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కమిషన్ చైర్మన్ హనుమంతరావు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.