నర్సంపేట టౌన్,నేటిధాత్రి :
నర్సంపేట పట్టాణానికి చెందిన బత్తిని వెంకట్ స్వామి గౌడ్ గుండె పోటుతో మంగళవారం మరణించారు.ఈసందర్భంగా
వెంకట్ స్వామి గౌడ్ మృతదేహంపై గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ఇంచార్జి సొల్టీ సారయ్య గౌడ్,మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్,రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గండి గిరిగౌడ్, జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,మాచర్ల సమ్మయ్య గౌడ్,గౌడ వెల్ఫేర్ సంఘం అధ్యక్ష,కార్యదర్శులు గండి లింగయ్య గౌడ్,మాచర్ల ఐలుమల్లు గౌడ్,బూర అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.