నర్సంపేట,నేటిధాత్రి :
నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్ లుగా తీర్చిదిద్దటానికి గాను అంగన్వాడీ టీచర్స్ కు శిక్షణ ఇవ్వటం జరుగుతున్నది. తెలంగాణా వ్యాప్తంగా శిక్షణ ఇవ్వటంలో భాగంగా బుదవారం నర్సంపేట ప్రాజెక్ట్ లో సిడిపిఓ విద్య హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లను 9 బ్యాచ్ లుగా చేసి 3 రోజులు శిక్షణ ఇస్తున్నామని, ప్రీస్కూల్ పిల్లలకు యూనిఫామ్ కూడా అందజేస్తామని తెలిపారు.పూర్తి శిక్షణ పొందిన టీచర్స్ తో ప్రీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,ఎలాంటి ఖర్చు లేకుండా అమ్మఒడిలాంటి అంగన్వాడీ కేంద్రంలో 3 నుండి 5 సంవత్సరాల పిల్లలను చేర్పించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ప్రియదర్శిని పూర్వ ప్రాధమిక వాచకం -1, పూర్వ ప్రాధమిక విద్యా కరదీపికలను అందజేశారు. సూపర్ వైజర్ పి. ఝాన్సీ, మంజుల శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సూపర్ వైజర్స్ జయరాణి, మాధవి, 36 మంది అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.