ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా..
కారేపల్లి నేటి ధాత్రి
అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఖమ్మం కలెక్టర్ కి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై ప్రకాష్ బజ్జురి వెంకటరామిరెడ్డి రాష్ట్ర నాయకులు ఎం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక విధానాల మూలంగా నేడు రైతాంగ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అలాగే ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాలను అరికట్టాలని అందుకు బాధ్యులైన వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని రైతులకు సరిపడినన్ని ఎరువులు విత్తనాలు పురుగుమందులు వ్యవసాయ పరికరాలు సబ్సిడీలపై అందించాలని వ్యవసాయ రుణాలను రద్దుచేసి కొత్త రుణాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని పంటల గిట్టుబాటు ధరను ముందే ప్రకటించాలని సి2 ప్లస్ 50 స్వామినాథ సిఫారసునామాలు చేయాలని పంటల గిట్టుబాటు ధర ఎం ఎస్ పి చట్టాన్ని అమలు చేయాలని ఫజల్ బీమా రైతు పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని అన్ని రకాల పంటలపై 500 రూపాయల బోనస్ ను తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని వివిధ రకాల రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కారం చేసి రైతాంగని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఎస్కే కాసిం శీలం సుదర్శన్ కే శ్రీనివాస్ రెడ్డి మాతంగి రామస్వామి పోలే పొంగు నాగయ్య దొండేటి వెంకటయ్య ఎస్.కె కాసింఖాన్ పి ప్రసాద్ పి నాగయ్య బద్రు నాగరాజు చప్పిడి వెంకటేశ్వర్లు జానకిరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.