*వరి కోత హార్వెస్టర్లకు (యజమానులకు/నిర్వాహకులకు) శిక్షణ

*వరి కోత హార్వెస్టర్లకు (యజమానులకు/నిర్వాహకులకు) శిక్షణ
అవగాహన కార్యక్రమం యాసంగి సీజన్ – 2025-26
(వరి ధాన్యం కొనుగోలు పై మండల స్థాయిలో సమన్వయ సమావేశం)
మొగుళ్లపల్లి నేటి దాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల స్థాయిలో రైతు వేదిక, వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్ రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎస్సై ముప్పుసురేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గార్ల ఆధ్వర్యంలో వరి కోత హార్వెస్టర్ల యజమానులకు మరియు నిర్వాహకులకు అలాగే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వరి ధాన్యం కోత మరియు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి అవగాహన కల్పించడం జరిగింది.
తహసీల్దార్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు అయిన నీడ సౌకర్యం, ఎలక్ట్రానిక్ తూకం మెషిన్, ప్యాడి క్లీనర్, తాగు నీరు, టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
మండల వ్యవసాయ శాఖ అధికారి మరియు ఎస్సైముప్పుసురేశ్ మాట్లాడుతూ వరి కోత సమయంలో వరి కంబైన్డ్ హార్వెస్టర్ యొక్క బ్లోయర్ ఆక్టివ్/ఆన్ లో ఉండాలని
వరి కంబైన్డ్ హార్వెస్టర్ మెషిన్ RPM 18 నుండి 20 ఉండాలని
గ్రౌండ్ స్పీడ్ రేంజ్/గేర్ రేషియో ఎప్పటికి B2 నుండి A1 కు ఉండే విధంగా చూసుకొని వరి కోతలు చేయాలని, తద్వారా తాలు, తప్ప, గడ్డి పొసలు లేకుండా నాణ్యమైన వరి ధాన్యం వస్తుందని తెల్పడం జరిగింది. కావున వరి కోత హార్వెస్టర్ల యజమానులు, రైతు సోదరులు ఈ జాగ్రత్తలు పాటించాలని కొరడమైనది.
“A” గ్రేడ్ వరి రకం క్వింటాల్కు రూ. 2389, సాదారణ రకం రూ. 2369 కనీస మద్దతు ధర అందించడం జరుగుతుంది. కావున రైతు సోదరులు నాణ్యమైన ధాన్యం తేమ శాతం 17 లోపు ఉన్నవి మరియు ఇతర నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, పి ఎ సి ఎస్ ఇంచార్జీలు, హార్వెస్టర్ యజమానులు/నిర్వాహకులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version