పరకాల నేటిధాత్రి
పరకాల,నడికూడ,దామెర, ఆత్మకూర్,శాయంపేట, మండలాల నిరుద్యోగ యువతీ యువకులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్వములో నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్.ఎ.సి) మరియు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ల్యాండ్ సర్వేయర్ డిపెండెంట్ ట్రైనింగ్ 3 నెలల శిక్షణ మరియు ఉఫాధి కార్యక్రమము ప్రారంభించారు. ఇట్టి ట్రైనింగ్ పీరియడ్ లో ఉచితంగా యూనిఫాం,స్టేషనరీ ఐటమ్స్ మరియు మధ్యాహ్న భోజనముతో పాటు న్యాక్ నుండి స్కిల్ సర్టిఫికెట్ తో పాటు నిర్మాణ రంగ కంపెనీలలో ఉపాధి అవకాశములు కల్పించబడును.ఈ సంస్థ కల్పించే కోర్సు ల్యాండ్ సర్వేయర్ శిక్షణ కాలం మూడు నెలలు శిక్షణకు కావాల్సిన అర్హతలు ఇంటర్ పాస్ లేదా ఐ.టి.ఐ మరియు డిప్లమా చేసిన వారిని ఎంపిక చేస్తారు.ఇట్టి శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు వయసు కలిగి ఉండవలెను.ఇట్టి శిక్షణ కాలంలో అభ్యర్థులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించబడును.ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి బయోడేటా తో పాటు ఆధార్ కార్డు,రేషన్ కార్డు,బ్యాంక్ అకౌంట్,క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు మరియు తండ్రి లేదా తల్లి యొక్క లేబర్ కార్డు, నాలుగు కలర్ ఫోటోలతో పరకాల ఎస్సీ హాస్టల్ ఆర్.డి.ఓ ఆఫీస్ వెనకాల న్యాక్ ట్రైనింగ్ సెంటర్లో అడ్మిషన్ కోసం ఇట్టి సర్టిఫికెట్స్ సమర్పించి మీ యొక్క పేరు నమోదు చేసుకోగలరని మరింత సమాచారం కొరకు 9441975438 , 9581483526 అనే నెంబర్లకు ఫోన్ చేయగలరని అసిస్టెంట్ డైరెక్టర్ పి అశోక్ కుమార్ తెలియజేశారు.