మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి..
గోదావరి ఇసుకను మందమర్రి మండలానికి ఆన్లైన్ లో అందించాలి…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంచిర్యాల గోదావరి నది లోని ఇసుక మంచిర్యాల పరిసర ప్రాంతాలకు మాత్రమే ఆన్లైన్ లో ఇసుక బుకింక్ ప్రభుత్వం ఓపెన్ చేసిందని, మందమర్రి మండలానికి ఇసుకరీచ్ ఆన్లైన్ ఓపెన్ కాలేదని మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి ప్రాంతంలో పర్మిషన్ లేకుండా రెండు ఇసుక ట్రాక్టర్లు రావడంతో అట్టి ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఏడి పేర్కొన్నారు. మందమర్రి మండలానికి గోదావరి ఇసుక వారం రోజులలో ఆన్లైన్ ఓపెన్ అవుతుందని ప్రజలంతా గమనించాలని ఏడి కోరారు.మంచిర్యాల గోదావరి నది నుండి ఇసుక ఎట్టి పరిస్థితిల్లో మందమర్రి మండలానికి పంపించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే అధికారులకు, నాయకులకు సమాచారం అందించినట్లు ప్రజలు అనుకుంటున్నారు. గోదావరి నది నుండి ఇసుక రవాణా రాకుంటే నిర్మాణంలో ఉన్న ఇండ్ల పరిస్థితి ఏంటని గద్దెరాగడి,రామకృష్ణాపూర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ట్రాక్టర్ ఓనర్లు మాత్రం ప్రభుత్వం వెంటనే ఇసుక ను మందమర్రి మండలానికి ఆన్లైన్లో ఓపెన్ చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల నుండి గద్దెరాగడి కి వచ్చిన ఇసుక ట్రాక్టర్లను క్యాతనపల్లి ప్రాంత ట్రాక్టర్ ఓనర్లు ఆపి నిరసన వ్యక్తం చేశారు, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం ట్రాక్టర్ ఓనర్ల కు మద్దతు పలికారు. ఏదేమైనప్పటికీ మంచిర్యాల గోదావరి నది నుండి మందమర్రి మండలానికి ఇసుకను ఆన్లైన్ లో అందించేలా అధికారులు, నాయకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో 7 వ వార్డ్ కౌన్సిలర్ పొలం సత్యం, 9 వ వార్డ్ కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి,20 వ వార్డ్ కౌన్సిలర్ బోయినపల్లి అనిల్ రావు,ట్రాక్టర్ ఓనర్లు ఉన్నారు.