విద్యారంగం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి – టిపిటిఎఫ్
టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి ప్రోగ్రాముల ద్వారా విద్యార్థుల్లో విద్య నైపుణ్యాలను పెంపోందించాలని, రానున్న పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాల కొరకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు పిలుపునిచ్చినారు. శనివారం స్థానిక మండల విద్య వనరుల కేంద్రం జమ్మికుంటలో టిపిటిఎఫ్ కరీంనగర్ జిల్లా డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమములో పాల్గొని మాట్లాడారు. టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పట్ల చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఉద్యోగులకు ఎన్నో సమస్యలు తిష్ట వేసి వున్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. పిఆర్సి బాకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదని, మూడు డిఏలు ఇప్పటికి పెండింగ్ లోనే ఉన్నాయని, కేంద్రం మళ్ళీ కొత్త డిఏ ఇచ్చుటకు సిద్ధంగా వున్నదని దీనితో 4 డిఏలు పెండింగ్లో ఉన్నట్లు అవుతుందని వారు గుర్తు చేశారు. విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం చోరవ చూపి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కొనసాగించాలని.. ఉన్న ఖాళీల భర్తీకి వెంటనే డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పాఠశాలల్లో కొనసాగుతున్న ఉన్నతి కార్యక్రమం ఉపాధ్యాయులకు భారంగా, విద్యార్థులకు నిరూపయోగంగా మారిందని. ఈ కార్యక్రమం పై సమీక్ష చేసి విద్యార్థులను పరీక్షల ఒత్తిడి నుండి దూరం చేయాలని వారు డిమాండ్ చేశారు. టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యం వచ్చి లక్షలాది రూపాయాలు హాస్పటల్లో ఖర్చు చేసి రియింబర్స్మెంట్ పెట్టుకుంటే సంవత్సరాలు గడిచిన వాటికి మోక్షం లభించడం లేదని. అవి వచ్చిన అర-కొర అమౌంట్ ను రిలీజ్ చేస్తున్నారని అందువలన ఉద్యోగులు అప్పుల పాలు కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు నగదు రహిత హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశములో కరీంనగర్ జిల్లా బాద్యులు, కోడిగూటి తిరుపతి, కొండపాక తిరుపతి, సిహెచ్ బాబాన్న, మర్రి అవినాష్, రామస్వామి, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండల భాద్యులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.