*తిరుపతి పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ స్టాల్ ప్రారంభించిన..

*తిరుపతి పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ స్టాల్ ప్రారంభించిన

*జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.

*వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన తిరుపతి జిల్లా పోలీస్ శాఖ..

*రోడ్డు ప్రమాదాల నివారణకు కీలక అడుగు తిరుపతిలో హెల్మెట్ల స్టాల్ ప్రారంభం..

*ప్రాణ భద్రతే లక్ష్యం..హెల్మెట్ బరువు కాదు బాధ్యత..

*మీ కోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి..

*జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్., పిలుపు..

తిరుపతి(నేటి ధాత్రి) 

 

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., తిరుపతి పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ స్టాల్‌ను ప్రారంభించారు.ఈ స్టాల్‌లో కేవలం ఐఎస్ఐ (ఐ ఎస్ ఐ)
మార్కు గల నాణ్యమైన హెల్మెట్లనే సరసమైన ధరకు వాహనదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
వాహనదారుల ప్రాణ రక్షణే ప్రధాన లక్ష్యంగా, రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, హెల్మెట్ ఒక బరువు కాదు, అది ఒక బాధ్యత అని, ఆ బాధ్యత మనకోసం మాత్రమే కాకుండా మన కుటుంబం కోసం కూడా అని అన్నారు. మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తుందని, వారి ఆనందం, భవిష్యత్తు మీ భద్రతపై ఆధారపడి ఉందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, జీవించాలని ఆకాంక్షించారు.
నిర్లక్ష్య డ్రైవింగ్ చేయడం వల్ల మీతో పాటు ఎదుటివారి కుటుంబం కూడా రోడ్డున పడుతుందని అలాగే, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో ప్రజలు గ్రహించాలని సూచిస్తూ, గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తు చేశారు.
పోలీస్ శాఖ ప్రజల మేలు కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజల్లో చైతన్యం రానిదే ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాదని తెలిపారు. ఇది పోలీసుల ఆంక్ష కాదు,ప్రజల భద్రత కోసం చేస్తున్న విన్నపమని స్పష్టం చేస్తూ, ప్రతి వాహనదారుడు నాణ్యమైన హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలు శిక్షలు కూడా విధిస్తామని హెచ్చరించారు. దీనిని హెచ్చరికగా భావించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి, తమ ప్రాణ భద్రతకు తోడ్పడాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం జరగగా అందులో ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించడం వల్ల అతను ప్రాణాల నుండి బ్రతికి బయటపడ్డాడు అందులో మరో వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడం వల్ల తను మరణించడం జరిగింది. ఒక చిన్న హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఒక వ్యక్తి మరణించడం అనేది చాలా బాధాకరం.
దీన్ని బట్టి చూస్తే హెల్మెట్ యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. మీ భద్రతే మా బాధ్యత. అందరూ కచ్చితంగా హెల్మెట్ ధరించండి.
మీరు హెల్మేట్ ధరించి ఇంటికి సురక్షితంగా చేరుకొని మీ కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం .
ఇటీవల హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నుండి బయటపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి వారి ఇంటర్వ్యూలు కూడా త్వరలోనే సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది అది ప్రజలు గమనించి హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కనుక వాహనం నడిపే వ్యక్తే కాకుండా పిలియన్ (వెనుక కూర్చున్న వ్యక్తి) కూడా ధరించాలి.
కొంతమంది వ్యక్తులు ఐ ఎస్
ఐ,మార్కులేని హెల్మెట్లు విక్రయిస్తున్నారు అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్స్ వాడే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఇన్స్టిట్యూషన్స్ మరియు కంపెనీలు అందులోని వ్యక్తులకు హెల్మెట్ పై అవగాహన కల్పించి ఖచ్చితంగా ధరించాలని వారికి సూచించాలి.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు) రామక్రిష్ణచారి (డీఎస్పీ ట్రాఫిక్ ),భక్తవత్సలం (తిరుపతి డీఎస్పీ),చంద్ర శేఖర్ (డీఎస్పీ ఏఆర్) సీఐలు, ఎస్ఐలు, పోలీస్, సిబ్బంది పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version