వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కలియుగ దైవం శ్రీ తిరుమలనాథని స్వామి వెలసిన తిరుమలయ్య గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచాలని వనపర్తి పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో బచ్చు రాము శ్రీశైలం సీతారాములు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమలయ్య గుట్టపై పార్కు నిర్మించి కళ్యాణ మండపాని ఏర్పాటు చేయాలని దీని ద్వారా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడమే కాకుండా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రజలకు సౌకర్యంగావంతంగా ఉంటుందని విన తిపత్రంలో పేర్కొన్నారు.
