పరిశుభ్రత పాటించని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు
◆: -చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రం గుండా ఉన్న జాతీయ రహదారి పక్కన గల మురికి కాలువల పై కొనసాగుతున్న టిఫిన్ సెంటర్ లపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. అసలే వర్షాకాలం అని, అందులో ఎక్కడి కక్కడ మురికి నీరుతో పారుతున్న మురికి కాలువ పైనే టిఫిన్ సెంటర్ లను నడుపడం బాధాకరం అంటున్నారు. మురికి కాలువ పై వాలే దోమలు, విష పూరిత క్రిమి కీటకాలు తినుబండారాల పై వాలుతున్నాయని, దోమలు వాలిన తిను బండారాల ను తిన్న ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఏమాత్రం శుభ్రత పాటించని జహీరాబాద్ పట్టణ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న సింధు టిఫిన్ సెంటర్ కు సంభందించిన తినుబండారాలు మురికి కాలువ పక్కనే పెట్టీ అమ్ముతున్నారు. ప్రజలు కూడా పని హడా విడిలో మురికి కాలువను గమనించకుండా దోమలు వాలిన టిఫిన్ లను తింటున్నారు. అలాంటి ఆహారాలు తినడంతో అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని, జహీరాబాద్ పురపాలక సంఘం కమీషనర్, శానిటరీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు.