జిహెచ్ఎంసి వార్డుల విభజన ముసాయిదా విడుదల చేసిన తూంకుంట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి
* సరిహద్దులపై అభ్యంతరాలు, సూచనలు కౌంటర్ ఏర్పాటు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఇటీవల జిహెచ్ఎంసి లో విలీనమైన మున్సిపాలిటీలను కలుపుతూ మొత్తం జిహెచ్ఎంసి పరిధిని 300 వార్డులుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ గెజిట్ లో భాగంగా మొత్తం జిహెచ్ఎంసి
పరిధిలో తుంకుంట 300 వార్డు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము గెజిట్ విడుదల చేసింది.
ఇట్టి గెజిట్ ను అనుసరించి మొత్తం GHMC పరిధిలోని 300 వార్డులకు సంబంధించి వార్డు ల యొక్క సరిహద్దుల వివరములు ఉన్నవి. ఈ విషయమై జిహెచ్ఎంసి పరిధిలోని ప్రజల నుండి ఆభిప్రాయ సేకరణ అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి తూంకుంట సర్కిల్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ జ్యోతి తెలిపారు. ముసాయిదా వార్డుల విభజన ప్రతులను ప్రజల అందుబాటులో పెట్టడం జరిగిందని ప్రజలు ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.00 వరకు 7 రోజుల వరకు ప్రజలు నేరుగా కార్యాలయానికి విచ్చేసి తమ అభ్యంతరాలను, సూచనలను అక్కడ అందుబాటులో ఉన్న ప్రత్యేక ఫార్మాట్ రూపములో అందజేయాలని జిహెచ్ఎంసి తూంకుంట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి కోరారు. మేనేజర్ శ్రవణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు
