*బి ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కొత్త జైపాల్ రెడ్డి
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్లాపూర్ గ్రామంనికి చెందిన బీజేపి పార్టీ యువ నాయకుడు వేసిరెడ్డి రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది యువకులు భిఅర్ఎస్ పార్టీలోకి చేరారు రాష్ట్ర నాయకులు కొత్త జైపాల్ రెడ్డి నివాసంలో భిఅర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కొత్త జైపాల్ రెడ్డి బి ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడం అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళ నాయకుల గొడవలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం లేదు కావున రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి అని తెలిపారు బీజేపీ నుండి చేరిన యువకులు మన సీఎం కేసిఆర్ చేసిన అభివృద్ధి పనులు చేపట్టిన పథకాలు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వ పథకాలు బాగున్నాయి అని మరొక్కసారి భిఅర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు మన ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవి శంకర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల యూత్ అధ్యక్షుడు కట్ట గోవర్థన్ గౌడ్, బీ ఆర్ ఎస్ నాయకులు రామిడి రాజు, తదతరులు పాల్గొన్నారు.