మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సమ్మె విజయవంతం.
ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్,
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
శుక్రవారం రోజు దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శనగా తెలంగాణ చౌరస్తలో నిరసన సభ జరిగింది .
దీనికి సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రామ్మోహన్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్, విజయబాబు, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంక్ టేష్, టి యన్ టి యు సి జిల్లా నాయకులు ధన్వాడ రాములు మాట్లాడుతూ, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కష్టజీవులకు కష్టాలు కడగండ్లు మిగిలాయని .కార్మిక హక్కులను హరించడం. పని గంటలు పెంచడం. కార్మిక చట్టాలను కార్పొరేట్లకు యాజమాన్యాలకు పెట్టుబడుదరులకు అనుకూలంగా మార్చడం .కనీస వేతనాలు అమలు చేయకపోవడం, పెన్షన్ ఇవ్వకపోవడం. కార్పొరేట్లకు వంతపాడి కష్టజీవుల సంపదను దోచిపెడుతున్నాడని. మోడీ పాలనలో పెట్టుడి దారులు కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడము, కార్మికులు, కష్టజీవులు, రైతులు వ్యవసాయ కావలీలకు కడగండ్లు మిగిలాయని. ధరలకు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం. రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవడం. ఆప్రజాస్వామిక విధానాలు అవలంబించాడని. రాజ్యాంగానికి తూట్లు పొడిచి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ప్రశ్నించిన వారిపై దేశద్రోహ చట్టం మోపడం తదితర నిరంకుశ విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబించిందని. అమెరికాకు అనుంగు శిష్యుడుగా మారి భారత దేశ ప్రతిష్టను దిగజార్చారని వారు విమర్శించారు. ప్రభుత్వ రంగన్ని ప్రైవేటీకరించి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చి, దేశ సంపదను కొందరి చేతుల్లో పెట్టాడని. సంపద కేంద్రీకృతంగా మారి పేదలు కార్మికులు, రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు తీవ్రంగా
ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో మోడీని గద్దె దించి భారతదేశాన్ని రక్షించుకోవాలని వారు కార్మికులకు రైతులకు పిలుపునిచ్చారు సమ్మెకు మద్దతుగా యూబిఐ బ్యాంక్ అసోసియేషన్ నాయకులు జెట్టి రాజేష్, తిరుమల్ రెడ్డి మద్దతుగా ప్రసంగించారు.స్వప్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఎర్ర నరసింహులు ప్రభాకర్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వరదగాలన్న ,ప్లంబర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ముక్తార్ ఖాన్ ,టైల్స్ అండ్ గ్రానైట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రవి నాయక్ ,బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ నాయకులు విశ్వనాథం, హమాలీ యూనియన్ నాయకులు గోనెల ఆంజనేయులు, యాదగిరి, వెంకటేష్, రాజు ,గోపాల్, గోవర్ధన్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే మోహన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య తదితరులు మద్దతుగా ప్రసంగించారు. గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ,భువన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు పడాల వెంకటయ్య, వరద లక్ష్మయ్య, సిఐటియు జిల్లా కోశాధికారి చంద్రకాంత్ ,పట్టణ నాయకులు రాజ్ కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి గణేష్, బాలు ,వెంకట్ రాములు, హనుమంతు ఆశా వర్కర్ సీనియర్ నాయకులు పద్మ మధ్యాహ్నం భోజన సంఘం నాయకురలు కైరునిసా, సిద్ధమ్మ అంగన్వాడి యూనియన్ నాయకులు నర్సమ్మ రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.