గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కరకగూడెం బూటకపు ఎన్కౌంటర్ విషయమై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్,రాష్ట్ర కార్యదర్శి నారాయణ రావు,సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరు లను మణుగూరు సమీపంలో పోలీసులు నిర్బంధించడాన్ని అల్ ఇండియా ట్రైబల్ పోరం జాతీయ కన్వినర్, గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం తీవ్రంగా ఖండించారు. నిజనిర్ధారణకు వెళ్లుతున్న వారిని ఆపడం అంటే వాస్తవాలు బయటకు రాకుండా చేయడమే.నిజమైన ఎన్కౌంటర్ అయితే నిజ నిర్ధారణ బృందాన్ని జరిగిన ప్రాంతానికి అనుమతించాలి. కరకగూడెం ఎన్కౌంటర్ పోలీసు లు పక్కాపథకం ప్రకారం కాల్చి చంపడం వల్ల నిజనిర్ధారణ బృందాన్ని, పత్రికల వారిని అనుమతించకుండా బయట ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా చేయుటకు నిజ నిర్ధారణ బంధాన్ని అశ్వాపురం పోలీసు స్టేషన్లో నిర్బంధించారు.నిజనిర్ధారణ బృందాన్ని విడుదలచేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి వాస్తవాలను తెలుసు కొనుటకు అనుమతించాలన్నారు. వారిని అడ్డుకోవడం అంటే నేరాన్ని అంగీకరించడమే అవుతుందాన్నారు.
అక్రమంగా అరెస్టు చేసిన పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులను వెంటనే విడుదల చేయాలి
