ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ లో మాదిగ లకుకేటాయించాలని,నామినేటెడ్ పదవులు మాదిగ లకు అధిక ప్రాదాన్యత కల్పించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాదనలో అత్యధికంగా మాదిగలు పాల్గొని రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగ లే పనిచేశారన్నారు.ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి మాదిగ లకు అధిక ప్రాదాన్యత కల్పించాలని ఉపేందర్ మాదిగ కోరారు.