లీడర్ రూమల్ల సునీల్ కుమార్
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి-
అవసరం ఉన్నవారికి, ఆర్తులకు మేం సేవలందిస్తాం అనే నినాదంతో అంతర్జాతీయంగా లయన్స్ సభ్యులు సేవలందిస్తున్నారని ఈ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పట్టిహిల్ “చేంజ్ ద వరల్డ్ “అనే నినాదంతో లయన్స్ సంస్థ ద్వారా అన్ని రకాల సేవలతో పాటు, సమస్త ను బలోపేతం చేయడానికి సభ్యుల చేరిక కూడా అవసరమని, ఎంతమంది నూతన సభ్యులను చేర్పిస్తే వారిని అత్యున్నతంగా గుర్తింపునిస్తామని, అలాగే బంగారు పథకాలను, ప్రశంసా పత్రాలను ఇచ్చి ప్రోత్సహిస్తామని, 15 రోజుల్లో నూతన సభ్యులను చేర్పిస్తే వారిని, వారి సేవలను ప్రోత్సాహకాల ద్వారా గుర్తిస్తామని ఇచ్చిన పిలుపుమేరకు నూతన సభ్యులను లయన్స్ క్లబ్, లో చేర్పించి, గత 34 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ రామాయంపేట ద్వారా ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అవయవ దాన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి ఆదివారం సాయంత్రం కరీంనగర్ లోని వసుధ కన్వెన్షన్ లో నిర్వహించిన తెలంగాణ ప్రాంతములోని ఏడు లయన్స్ జిల్లాలు 320- ఏ, బి, సి,డి,ఈ,ఏఎఫ్,ఏచ్ జిల్లాల నుండి వచ్చిన లయన్స్ నాయకుల అవార్డ్స్ ప్రధానోత్సవం లో అంతర్జాతీయ అధ్యక్షురాలు లయన్ డాక్టర్ పార్టీ హిల్ ద్వారా నెలకొల్పిన గోల్డ్ మెడల్ మరియు ప్రశంసా పత్రాన్ని లయన్స్ ఏరియా లీడర్ సునీల్ కుమార్, కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు, గ్యాట్ లీడర్లు మనోజ్ కుమార్ పురోహిత్ ,దీపక్ భట్టాచార్య జి, లయన్ డాక్టర్ జి. బాబురావు గవర్నర్ వి.లక్ష్మి చేతులమీదుగా ప్రధానం చేస్తూ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి సంవత్సరము లయన్స్ జిల్లా క్యాబినెట్లో సభ్యుడిగా, నాయకుడిగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు లయన్స్ లీడర్లు అభినందించడం జరిగింది. ఈ మల్టిపుల్ కన్వెన్షన్ లో 320-డి లయన్స్ లీడర్లు నగేష్ పంపాటి, లయన్ అమర్నాథ్ రావు, లయన్ ఎం.విజయలక్ష్మి, లయన్ టి పద్మావతి, లయన్ ఎం నాగరాజు,లయన్ నరసింహారాజు మరియు లయన్ మర్రి ప్రవీణ్ లయన్ సూర్యనారాయణ,అసపల్లి శ్రీధర్, మాజీ గవర్నర్లు లయన్ బి.వి.బన్సల్ రమేష్, ప్రకాష్ రావు డాక్టర్ రామకృష్ణారెడ్డి, సూర్య రాజ్,ఓబుల్ రెడ్డి, కోటిరెడ్డి, రంజిత్ రెడ్డి అమరేందర్ రెడ్డిలు కన్వెన్షన్ నిర్వాహకులు
శ్రీనివాస్ రెడ్డి,రాజిరెడ్డి లు పాల్గొని రాజశేఖర్ రెడ్డి సేవలను అభినందించారు. మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ నాయకులు పి. కేశవరెడ్డి, లయన్ వి. రాధాకృష్ణారెడ్డి,లయన్ ఏ. నటరాజ్, లయన్ గోలి అమరేందర్ రెడ్డి లు, ఇతర నాయకులు రాజశేఖర్ రెడ్డి అవార్డును అందుకోవడం పట్ల హర్షాన్ని ప్రకటించారు.