అత్తా కోడలు రాజకీయం కోసం కాదు…భూముల కోసం!

https://epaper.netidhatri.com/

` ఝాన్సీ రెడ్డి రాజకీయం వెనుక అసలు కుట్ర?

` ఆ భూముల మీద పడిరది ఝాన్సీ రెడ్డి కన్ను

 

`మా భూములు మాకు కావాలి.

` రైతుల వద్ద వున్న భూములు లాక్కోవడం కోసం.

`బిఆర్‌ఎస్‌ అధికారంలో వుంటే ఆ భూములు వశం కావు.

`రాజకీయం పేరుతో వచ్చింది.

`జనాన్ని నమ్మించాలని చూస్తోంది.

`ధరణిలో వున్న భూములపై ఆశలు పెరిగాయి.

`వద్దని వదిలేసుకున్న భూముల విలువ ఇప్పుడు వందల కోట్లు.

`రాజకీయం ద్వారానే స్వాదీనానికి మార్గం.

`వాటి కోసం ఓట్లకు ఎంతకైనా కొనడానికి సిద్ధం!

`పాలకుర్తిలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ?

 

ALSO READ: https://netidhatri.com/brs-wins-with-a-bumper-majority-says-government-chief-whip-dasyam-vinay-bhaskar/

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలు చేసేవారంతా ప్రజాసేవకులు కాదు. ప్రజాసేవ చేస్తామంటూ వచ్చేవారంతా రాజకీయాలు చేయరు. అలాగే పాలకుర్తి ప్రజల మీద ముప్పై ఏళ్ల తర్వాత సొంత గడ్డమీద అడుగుపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఝాన్సీ రెడ్డి రాజకీయం ప్రజల కోసం కాదు? ఇది ఇప్పుడు పాలకుర్తి నియోకవర్గంలో జరుగుతున్న ప్రధాన చర్చ. మరి ఝాన్సీ రెడ్డి ఇంత కాలం తర్వాత ఎందుకొచ్చినట్లు? ప్రజల మీద ప్రేమ పుట్టుక్కున ఎందుకు పుట్టుకొచ్చినట్లు? నిజంగా ఆమెకు ప్రజా సేవ చేయాలన్న ఆలోచన వుందా? నిజంగా ఆ ప్రజల మీద ప్రేమ వుంటే ఇంత కాలం ఎందుకు ఆగినట్లు? చర్చ జోరుగా సాగుతోంది. ఝాన్సీ రెడ్డి పాలకుర్తి రాక వెనక పెద్ద బాగోతమే వుందని తెలుస్తోంది. అందుకు ధరణి దారి తీసింది. అవును. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగా ఝాన్సీ రెడ్డి పాలకుర్తి ప్రజల మీద హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. దాంతో ఏడు నెలల క్రితం కాంగ్రెస్‌పార్టీ రూపంలో పాలకుర్తిలో అడుగుపెట్టారు. ఆ అడుగు వెనక ఏముందనేది తెలుసుకోవాలంటే ఎనభైవ దశకంలోకి వెళ్లిపోవాలి. ఝాన్సీ రెడ్డి కుటుంబం ఒకప్పుడు దొరల కుటుంబం. వారికి ఎన్ని వేల ఎకరాల భూమి వుందో వారికే తెలియదు. నిజాం కాలం నుంచి వారికి వేలాది ఎకరాలు వున్నాయి. అయితే కాలం గడుస్తున్న కొద్ది తెలంగాణలో దొరలకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు మొదలైంది. నక్సల్స్‌ రూపంలో బెదిరింపులు మొదలయ్యాయి. పల్లెలనుంచి దొరలను తరిమే కార్యక్రమం మొదలైంది. ముఖ్యంగా ఎనభైవ దశకంలో భూస్వాములు పల్లెలు వదిలి పట్నాల బాట పట్టారు. అలాగే ఝాన్సీ రెడ్డి కుటుంబం అమెరికా పయనమైంది. కాకపోతే పాలకుర్తి నియోజకవర్గంలో వున్న తమ భూముల మీద మమకారం మాత్రం పోలేదు.
కొన్ని దశాబ్ధాలుగా అక్కడి ప్రజలు ఆ భూములను సాగుచేసుకుంటున్నారు.
భూ యజమానులుగా కూడా వాళ్లే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పుణ్యమా? అని ఝాన్సీ రెడ్డి వాళ్లకు ఎన్ని వందల ఎకరాల భూములున్నాయన్నది తేలిపోయింది. వాళ్లుకు మళ్లీ ఆ భూములు మీద ప్రేమ పెరిగింది. అమెరికాలో కూడా లేనంతగా భూముల ధరలు తెలంగాణలో పెరిగాయి. ఒకప్పుడు సాగుకు కూడా పనికి రాని భూముల్లో తెలంగాణ వచ్చాక బంగారు పంటలు పండుతున్నాయి. తొండలు కూడా గుడ్లు పెట్టవు అన్న భూములు లక్షల విలువ చేస్తున్నాయి. గోల్కొండ రైలు అరగంట పాటు ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం ఝాన్సీ రెడ్డి పూర్వీకులకు భూములు వుండేవని అంటారు. అలా కాలక్రమంలో కనుమరుగైన భూములు పోను..ఇప్పటికీ కొన్ని వందల ఎకరాలు భూములు ఇంకా ఝాన్సీ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుమీదే వున్నాయి. ధరణితో ఒక్కసారిగా వారి పేరు మీద వున్న భూములు వివరాలు, ఇప్పుడు వాటి ధరలు తెలిశాక ఆ భూములను సొoతం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. మళ్లీ తమ ఆధిపత్యం కావాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే అమెరికాను వదిలి పాలకుర్తికి ప్రయాణమయ్యారు. ఊరికి వచ్చి మా భూములు మాకు ఇవ్వమంటే ప్రజలు ఇస్తారా? మళ్లీ తిరగబడతారు. అందుకే మీకు సేవ చేసేందుకు వచ్చానని చెబితే నమ్ముతారు. అమెరికాలో బాగా సంపాదించాం.. మీకు సేవ చేయాలని వచ్చామంటే విశ్వసిస్తారు.లేకుంటే ఇప్పుడిచ్చిన గౌరవం ఇవ్వరు. కనీసం విలువ కూడా ఇవ్వరు. ఏ భూముల్లో సాగు చేసుకుంటున్నారో ఆ రైతులు కూడా మర్యాద ఇవ్వరు. అందుకే ఆ భూములు మావే అన్నది ప్రపంచానికి తెలియాలి. అందుకు రాజకీయాలను రాజకీయాలను వేధిక చేసుకోవాలని ఝాన్సీ రెడ్డి పధకం వేశారు.
మా పూర్వీకులు పాలకుర్తి కోసంఎంతో చేశారు. మేం కూడా మన ప్రాంతానికి సేవ చేయాలనుకుంటున్నాం.
అనాధశ్రమాలు ఏర్పాటు చేస్తాతం. పేదలకు అండగా వుంటాం అని చెబితే నమ్ముతారు. అందుకు మాకు ఈతరానికి సేవ చేయాలని వుందంటూ ఊళ్లోకి దిగారు. అమెరికాలో విలాసవంతమైన జీవితం వదిలేసి, ప్రజలకు సేవ చేయాలని ఝాన్సీ రెడ్డి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ తతంగమంతా రూపకల్పనలోకి రావడానికి అమెరికాలో కొంత కసరత్తు జరిగింది. ఏడాది క్రితం పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడ ఝాన్సీ రెడ్డి కుటుంబం ఆయనను కలిసింది. విషయం చెప్పింది. అంతే ఝాన్సీ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీకి వున్న అనుబంధం కూడా తెలిసింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రాజకీయంగా ఎదుర్కొవాలంటే ఆయనకు ధీటుగా నిలబడే వాళ్లు కావాలి. ఎంతైనా ఖర్చు చేసేందుకు ఝాన్సీ రెడ్డి కుటుంబం ముందుకు రావడం రేవంత్‌రెడ్డికి కూడా కలిసొచ్చింది. ఒక వేళ తెలంగాణలో కాంగ్రెస్‌ ఫార్టీ అధికారంలోకి వస్తే పాలకుర్తి నియోజకవర్గంలో వున్న భూములన్నీ తిరిగి ఝాన్సీ రెడ్డి తమ వశం చేసుకోవచ్చు. ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను తిరిగి ఝాన్సీ రెడ్డి స్వాదీనం చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మా భూములు మాకు కావాలంటే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంగీకరించదు. పాలకుర్తిలో మంత్రి దయాకర్‌రావు ప్రజలకు నష్టం జరిగే పనులను సాగనివ్వరు. అందుకు అటు నుంచి నరుక్కొచ్చే కార్యక్రమం చేపట్టారు. రేవంత్‌రెడ్డికి తో బేరం కుదుర్చుకున్నారు. టికెట్‌ కోసం రేవంత్‌రెడ్డికి ముట్టజెప్పేంత ముట్టు జెప్పారు. అయితే ఇటీవల ఒక అనుకోని సంఘటన జరిగింది. అమెరికాలో ఇంత కాలం వున్న ఝాన్సీ రెడ్డి హఠాత్తుగా ఇండియాలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలంటే కొన్ని నిబంధనలు, షరతులు అడ్డుపడ్డాయి. మొదటిసారి ఝాన్సీ రెడ్డి పాలకుర్తికి వచ్చి ఏడు నెలలే అవుతుంది. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు కనీసం ఏడాది పాటు ఇండియా వున్నట్లు లేకుంటే, ఏడాది క్రితమే వచ్చినట్లు రజువులు కావాలి. దాంతో ఝాన్సీ రెడ్డి ప్రయత్నం మొదటికొచ్చింది. దాంతో ఎలాగైనా టికెట్‌ మా కుటుంబానికి దక్కాలని ఝాన్సీ రెడ్డి పట్టుపట్టింది. తన కోడలుకు టిక్కెట్‌ ఇప్పించుకున్నది. రాజకీయం మొదలుపెట్టింది.
ఈ రాజకీయం కుటుంబంలో కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది.
వద్దని కుటుంబ సభ్యులు ఝాన్సీ రెడ్డి వారించారని కూడా సమాచారం. కాని ఎలాగైనా మన భూములు మన అనుమతి లేకుండా ఎవరో అనుభవిస్తున్నప్పుడు కనీసం మన మీద కృతజ్ఞతా భావం కూడా వుండకూడదా? ఇంత కాలం మన భూములు ఏమిటో పూర్తిగా తెలియలేదు. తెలిసినప్పుడు మనమెందుకు వదిలేయాలి. మన వల్ల వారు ఇంత కాలం సాగు చేసుకుంటూ జీవితాలు గుడపుతున్నారన్నదైనా తెలియాలి. లేకుంటే ఆ భూములు మావే అన్న భ్రమలో వుంటారు. ఆ భూములు ఝాన్సీ రెడ్డి కుటుంబాలకు చెందనవి అన్నది తెలియాలి. మనకు వ్యతిరేకులెవరైనా వుంటే వారి చేతుల్లో మన భూములు ఎందుకుండాలి. ఇప్పుడు తెలంగాణలో భూములు హాట్‌కేకులు. అమెరికాలో ఎంత కాలం వున్నా, అంత డబ్బు సంపాదించలేం. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్ధులు పాలకుర్తిలో వున్నాయి. వాటిని వదిలేసి, ఇక్కడ కష్టపడడం ఎందుకు? ముందు మన భూములు మన చేతుల్లోకి రావాలి. ఆ తర్వాత పాలకుర్తిలో వుండాలా? వద్దా? వాటిని అమ్ముకుందామా? లేక రాజకీయంగా బలపడితే అక్కడే వుందామా? అన్నది ఆలోచిద్దాం. ముందు రాజకీయంగా అడుగు పెడదాం. పేదలకు సేవ చేస్తామని చెబుదాం…మన భూములే కావడం వల్ల ప్రజా సేవ కోసం అంటే ఇతర ప్రజలు కూడా మనకే సహకరిస్తారు. మన వైపే నిలుస్తారు. దాంతో మన భూములు ధారాదత్తంచేసుకున్నవారి నుంచి తీసుకోవడం సులభం..ఇదీ నా రాజకీయం అని చెప్పి , కుటుంబాన్ని ఒప్పించి రంగంలోకి దిగారన్నది పెద్దఎత్తున పాలకుర్తిలో జరుగుతోంది. ప్రజలే ఆలోచించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!