-గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
-దేశ జనాభాలో యువతే అధికం
వారు సరైన దారిలో నడిస్తేనే దేశ ప్రగతి ఉజ్వలమవుతుందని
-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శుక్రవారం వేములవాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో, చందుర్తి మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండా ను ఎగురవేసి.. ప్రసంగించారు.
పాఠశాలలో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ. నేర్చుకున్న విలువలు బడి వరకే పరిమితమవుతున్నాయని. వాటిని పాటించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా. దేశభక్తులుగా తయారు చేయాలని సూచించారు.
గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని పట్టించుకొని మిగతా రోజుల్లో వదిలేస్తే ప్రయోజనమేముందని. నిత్య స్ఫూర్తి కలిగేలా వ్యక్తి నిర్మాణం జరగాలన్నారు.
యువత విలువలతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని.సమాజం మారాలంటే మార్పు మన నుంచి మొదలవ్వాలి.అప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి అర్థం, పరమార్థం ఉంటుందన్నారు.