చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేసి కేక్ కట్ చేయడం జరిగిందని తెలంగాణా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు,అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించిన దానిని అధికారంగా 26 జనవరి 1950 అమలు పరిచి ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారని తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నేటికీ 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఏవైయస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలుగు స్కూల్ ప్రిన్సిపాల్ గోలుకొండ భిక్షపతి అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ జిల్లా నాయకులు పుల్ల ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి బి .ఎస్.పి టేకుమట్ల మండల అధ్యక్షుడు సంగి రవి ఏవైయస్ మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ ఉపాధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మ్యాదరి సునీల్ ఏవైయస్ మరియు స్టార్ యూత్ నాయకులు బొడ్డు ప్రభాకర్, గుర్రం తిరుపతి గుర్రపు రాజ మొగిలి గురుకుంట్ల కిరణ్ కనకం తిరుపతి అల్లకొండ కుమార్ కట్కూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.