భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి వ్యాప్తంగా నెలకొన్న మైనింగ్ స్టాప్ సమస్యల పట్ల భూపాలపల్లి ఏరియాలో తేదీ 18 3 24 సోమవారం రోజున అన్ని గనుల మేనేజర్లకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మెమోరండం ఇవ్వడం జరిగింది.
సింగరేణికి వెన్నెముక అయినటువంటి మైనింగ్ స్టాప్ సమస్యలు యాజమాన్యం వెంటనే పరిష్కరించి వారికి తగు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనుల డిపార్ట్మెంట్లలో మేనేజర్ ద్వారా సిఎన్ఎండికి మెమొరం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ తోట రామచందర్, మనీ స్టాప్ బ్రాంచ్ నాయకులు సికిందర్ సింగ్, ఆసిఫ్ పాషా, పి నారాయణమూర్తి తిరుపతి రెడ్డి, అంకం శ్రీనివాస్, సురేష్, జి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, టి రాజన్న, టీ లక్షణామూర్తి, పి శ్రావణ్, గణేష్, అసిస్టెంట్ బ్యాలెన్స్ సెక్రటరీ ఎం విజయేందర్, ఎల్ శంకర్, అజయ్, శివ, రవి, రత్నం, కృష్ణమూర్తి సుదర్శన్ నరేందర్ సదయ్య తదితరులు పాల్గొన్నారు.