జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
జిల్లా పోలీస్ సిబ్బందికి వారం రోజులపాటు గ్రేహౌండ్స్ ప్రత్యేక శిక్షణను ఈ రోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రారంభించారు.ఈ శిక్షణను సుమారుగా 150 మంది పోలీస్ అధికారులు,సిబ్బంది తీసుకొనున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు వారితో సమావేశమై పోలీస్ సిబ్బంది శారీరిక దారుఢ్యం కోసం,మానసికంగా బలంగా ఉండటానికి ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతలు మరియు మెలకువలను మెరుగుపరచుకోవడానికి కూడా ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.రానున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు,చెక్పోస్ట్ ల వద్ద విధులు,వాహనాల ముమ్మర తనిఖీ మరియు ఇతర పోలీస్ సంబంధిత విధుల నిర్వహణ కొరకు ఈ ప్రత్యేక శిక్షణను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.ఈ శిక్షణకు ఎంపిక చేయబడిన వారిలో ఇండోర్ మరియు అవుట్ డోర్ తరగతులలో ప్రతిభ కనబరచిన వారికి రివార్థులను అందజేయడం జరుగుతుందని తెలిపారు.కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.