భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలంలో ఆశా వర్కర్ల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అందుబాటులో లేనందున క్యాంప్ ఆఫీస్ పి ఏ మరియు మండల నాయకులకు వినతి పత్రాన్ని సమర్పించిన ఆశ వర్కర్లు.
వారి యొక్క డిమాండ్లను ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇస్తానన్న హామీలను అమలు చేయాలని వారు కోరడం జరిగింది. అదేవిధంగా ప్రమోషన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, అరికెళ్ళ తిరుపతిరావు, చింతాడి చిట్టిబాబు, భీమవరపు వెంకటరెడ్డి, చాట్ల రవి, మామిడి పుల్లారావు, పుల్లగిరి నాగేంద్ర, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు గాడి. విజయ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల వెంకట్, గాడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.