నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రం తో పాటు,ఉప్పల్,గూడూరు, అంబాల,శ్రీరాములపల్లి,
గూనిపర్తి,వంగపల్లి, మర్రిపెల్లి గూడెం,
గ్రామాలలోని శివాలయాలలో హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు ప్రత్యేక పూజలు,అభిషేకం నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా శివుని వేడుకున్నామని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు
ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని,
మంచి వర్షాలు కురవాలని పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్ధించినట్లు తెలిపారు.
కమలపూర్ మండలం లోని శనిగరం, మాదన్నపేట,
లక్ష్మీపురం గ్రామాలకు చివరి ఆయకట్టు వరకు డి.బి.ఎం.22, 22A, కేనాల్ ద్వారా రైతుల కోరిక మేరకు నీళ్లు విడుదల చేశామని, రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. రైతు సంక్షేపం కోసం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,భక్తులు పాల్గొన్నారు.