వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
పరకాల నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రపన్ని ధర్మారెడ్డి ఎలాగైనా ఓడించాలని, లేకుంటే మనకు నియోజవర్గంలో రాజకీయాసన్యాసం తప్పదని తోడేళ్లగుంపు ఒక్కటై ఎదురుచూస్తున్నారని,అసలు పరకాలలో ఓటు అడిగే నైతికహక్కు ప్రతిపక్షాలకు లేదని బిఅర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు శిరిసే శ్రీకాంత్ ఆరోపించారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బిఅర్ఎస్ యూత్ సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో గుంటనక్కలు ఒకవైపు ధర్మాన్ని నమ్ముకున్న ధర్మన్న ఒకవైపు అన్నట్టుగా నియోజకవర్గం పరిస్థితి ఉన్నదన్నారు.2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఇనుగాలను బరిలో దింపుతే చల్లా చేతిలో ఓటమిపాలయ్యాడని,అలాగే 2018 ఎన్నికల్లో ధర్మారెడ్డిని డీ కొట్టాలంటే మళ్ళీ కొండా ను బరిలో దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా కొండాను పిండి చేసి పరకాల నుండి సాగానంపిన పరిస్థితిని తెలుసన్నారు.మరోసారి చల్లా ధర్మారెడ్డిని ఎదుర్కొనడానికి నర్సంపేట నుండి వచ్చిన వలస పక్షి రేవూరి ప్రకాశ్ రెడ్డిని తీసుకువచ్చిన కాంగ్రెస్ నాయకులు ముగ్గురు ఒక్కటై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.ఎన్నికల తర్వాత ప్రతిపక్ష గుంట నక్కలు పరకాలను విదిచిపోవడం కాయం అని తెలిపారు.సమావేశంలో
బిఅర్ఎస్ యూత్ మండల కార్యదర్శి మహ్మద్ అజరుద్దీన్, నాయకులు గాలి అన్వేష్, అఖిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.