సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ..
కారేపల్లి నేటి ధాత్రి
భారత దేశంలోని 14 రాష్ట్రాల్లో విస్తరించి పిసిసి సిపిఐ ఎంఎల్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా, సిపిఐ ఎంఎల్ రివల్యూషనరి ఇన్సియేటివ్, మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల విలీనమై సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఏర్పడుతున్న సందర్భంగా 2024 మార్చి 3,4,5 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఐక్యతా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల కార్యదర్శి గుమ్మడి సందీప్ పిలుపునిచ్చారు
శుక్రవారం స్థానిక సింగరేణి మండల కేంద్రంలో మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరగబోయే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ముద్రించిన వాల్ పోస్టర్లు లను ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత విప్లవోద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదన్నారు. మారిన పరిస్థితులను సరిగ్గా అంచనా వేసుకోలేకపోయిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశ పెట్టుబడిదారీ విధానం విసిరే సవాళ్లను అధిగమించడానికి కమ్యూనిస్టు విప్లవోద్యమం సైతం మార్పులు చేసుకోవాల్సి ఉందన్నారు. ఆ కృషి కొనసాగింపే మూడు పార్టీల ఐక్యత అని అన్నారు. 14 రాష్ట్రాలలో, వివిధ స్థాయిలలో పనిచేసే మూడు పార్టీలు కలిసి చర్చించుకుని ఒక అవగాహన ఏర్పరచుకొని ఐక్యం కావాలని నిర్ణయించుకున్నాయన్నారు. 2024 మార్చ్ 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో ఐక్యతా మహాసభ ఉంటుందన్నారు. దేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఈ ఐక్యత సభ ఒక ముందడుగుగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఐక్యత జాతీయ మహాసభలు మార్చి 3 తేదీన ఖమ్మంలోని ఎస్ ఆర్ అండ్ బి జె ఎన్ ఆర్ కాలేజ్ నుండి పెవిలియన్ గ్రౌండ్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీ, అనంతరం ఏ పెవిలియన్ గ్రౌండ్ లో బహిరంగ సభ, మార్చి 4 5 తేదీలలో భక్తరామ కళాక్షేత్రంలో 500 మంది ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరిగే మూడు విప్లవ పార్టీల ఐక్యత మహాసభకు ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని వారు వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాపంథాసహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్, డివిజన్ నాయకులు గుగులోతు తేజ నాయక్ వడ్డే వెంకటేశ్వర్లు సత్తిరెడ్డి తాటి పాపారావు కోయిల శ్రీను రావుల నాగేశ్వరరావు బాలు రాములు ముక్తి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు