పాల్గొన్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలకు త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలని సంబధిత అధికారులకు సూచించారు. చెరువు శిఖాలు, ప్రభుత్వ భూములల్లో అక్రమ కట్టడాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం అధికారులపై ఉందని అన్నారు. అన్ని వార్డులల్లో మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో సరిగా పనిచేయని అధికారులపై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో పలువురు వార్డు కౌన్సిలర్లు వార్డుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అట్టి విషయాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన అన్ని పనులను పూర్తి చేయాలని అక్కడున్న వివిధ శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వారం పది రోజుల్లో అన్ని పనులను పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యే కు వివరించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్ధు వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.