ఖనిజ వనరుల తవ్వకాల ప్రతిపాదన చట్టాన్ని .

ఖనిజ వనరుల తవ్వకాల ప్రతిపాదన చట్టాన్ని సవరించాలి…

నేటి ధాత్రి -బయ్యారం 

ఖనిజ వనరుల తవ్వకాలకు సంబంధించిన చట్టాన్ని సవరించి, బొగ్గు మరియు ఇతర గనుల నుంచి వచ్చే లాభాలలో 50% వాటాను కార్మికుల సంక్షేమం కోసం, రైతులు మరియు గిరిజన వర్గాల సంక్షేమం కోసం కేటాయించాలని టి యు సి ఐ జిల్లా కార్యదర్శి బిళ్ళ కంటి సూర్యం, సిఐటియు జిల్లా నాయకులు వల్లాల వెంకన్న, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు సారిక శ్రీను, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఏపూరి వీరభద్రం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎస్.కె మదార్ డిమాండ్ చేశారు.

 

 

 

 

జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా బయ్యారంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రభుత్వం అన్ని ఆహార ధాన్యాలను స్వామినాథన్ సిఫారసు ప్రకారం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.విత్తనాలు, ఎరువులు,విద్యుత్ పై రైతులకు ఇచ్చే రాయితీలను పెంచాలని,పంటల బీమాను ప్రవేశపెట్టాలని కోరారు.విద్యుత్ సవరణ చట్టం 2022 ను రద్దు చేయాలని,విద్యుత్తు రంగంలో ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఉపాధిని ప్రాథమిక హక్కుగా చేయాలని,ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,

 

 

 

 

నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, సంవత్సరానికి 200 రోజులు ఉపాధి హామీ పనులు కల్పించి రోజుకు రు.600 వేతనాలు ఇవ్వాలని అన్నారు.అందరికీ ఉచిత విద్యా,వైద్యం అందించాలని,ఆరోగ్య సంరక్షణకు తాగునీరు, పారిశుధ్య,గృహ నిర్మాణం అంశాలపై ప్రభుత్వం హామీలు ఇవ్వాలన్నారు.2020 నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని,అటవీ హక్కుల చట్టం

 

 

 

ఎఫ్ ఆర్ ఏ కఠినంగా అమలు చేయాలని కోరారు.జీవ వైవిద్య చట్టం 2023 అటవీ వినియోగ చట్టాన్ని చేసిన సవరణలు ఉపసంహరించుకోవాలన్నారు.భవన నిర్మాణ కార్మికులకు, స్కీం వర్కర్లకు ఈఎస్ఐ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు.ఈ సమ్మె కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మండ రాజయ్య,ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బండారు ఐలయ్య,ఏఐయుకేఎస్ జిల్లా నాయకులు జగ్గన్న,టియుసిఐ బయ్యారం ఏరియా కార్యదర్శి

 

 

 

పూజల లచ్చయ్య,రైతు సంఘం నాయకులు నంబూరి మధు,
సిఐటియు నాయకులు మోహన్,
పి వై ఎల్ నాయకులు తుడుం వీరభద్రం,
తోకల వెంకన్న,భక్తుల ధనుంజయ,గుర్రం పూర్ణ,
ఎస్.కె లతీఫ్,అంగన్వాడి కార్యకర్తలు,ఆశ వర్కర్లు,భవన నిర్మాణ కార్మికులు,హమాలీ కార్మికులు,ట్రాక్టర్ వర్కర్స్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version