నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేటలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అసెంబ్లీ టైగర్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ పేరును నామకరణం చేయాలని ఎంసిపిఐ (యు)నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా నర్సంపేట మండలం నాగూర్లపల్లెలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి అమరులకు నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ కూడలిలో జరిగిన సభలో కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ భూమి,భుక్తి,విముక్తి కోసం,వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పటేల్ , పట్వారి,జాగిర్దారి వ్యవస్థను రద్దుచేయాలని త్యాగాలుచేసి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజలకు పంచిన ఘనత మద్దికాయల ఓంకార్ కె దక్కిందన్నారు.ప్రజాపాలన అని చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం , ఓంకార్ కు సముచిత గౌరవం ఇవ్వాలని,నర్సంపేటలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి , స్మృతి వనం ఏర్పాటు చేయాలని అందుకు స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ,మంత్రులు దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం,మండల నాయకుడు అనుమాల రమేష్,స్థానిక నాయకులు జవాజి చంద్రమౌళి,కందికొండ నరసింహస్వామి ,గుర్రం రవి,కందికొండ సాంబయ్య,ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు