# ఎమ్మెల్యే దొంతి నివాసంలో గణపయ్యకు ఘనంగా వీడ్కోలు.
నర్సంపేట,నేటిధాత్రి :
గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి కుటుంబ సభ్యులు తొమ్మిది రోజుల పాటు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విశేష పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరాడు. నర్సంపేట ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన గణపతికి ఆదివారం నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు దొంతి మాధవరెడ్డి శాలినిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే కుమార్తె అనన్య రెడ్డి తానే వినాయకున్ని నిమజ్జనం కోసం స్వయంగా మోసుకెళ్లి భక్తిని చాటుకుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ ఏటా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నర్సంపేట ప్రజలందరూ పసిడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నిత్యం వినాయకునికి పూజలు అందించినట్లు తెలిపారు. పూజల అనంతరం వినాయక నిమజ్జనం రోజున ఎమ్మెల్యే నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది.