పార్లమెంటులో చట్ట సవరణ చేయాలి
నడికూడ,నేటిధాత్రి:
టెట్ నుండి మినహాయిస్తూ పార్లమెంటులో చట్ట సవరణ చెయ్యాలని పి ఆర్ టి యు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ అన్నారు.సెప్టెంబర్ 1, 2025 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉపాధ్యాయులందరూ ఉద్యోగంలో కొనసాగాలంటే రెండు సంవత్సరాల లోపు తప్పనిసరి గా టెట్ పాస్ కావాలని,ఇది ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురి చేస్తుందన్నారు. 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు, ప్రస్తు తం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్న పని అన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 23 అండర్ 2 సెక్షన్ ను సవరించి, ఉపాధ్యాయులకు 2010 కంటే ముందు నియామకమైనటువంటి ఉపాధ్యాయులు అప్పుడు ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ నిబంధనల ప్రకారం నియామకమైన ఉపాధ్యాయులు కాబట్టి,టెట్ నుండి మినహాయింపు ఇస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చట్టం చేసినప్పటి నుంచి ఏదైనా అమలు చేయాలి కానీ అంతకుముందు ఇంప్లిమెంట్ చేయడం ఏమిటని అన్నారు. చట్ట సవరణ చేయాలనే డిమాండ్తో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి,సుంకరి బిక్షం గౌడ్ ఢిల్లీలో ఉండి కేంద్ర ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రిని,ఇతర మంత్రులను ఎన్సిటి ఈ అధికారులను కలుస్తూ చట్ట సవరణ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
