టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

నేడు టిఎన్జీవోస్ ప్రెసిడెంట్ డేక్కా నరసింహారావు మరియు అసోసియేట్ అధ్యక్షుడు కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవోస్ కార్యాలయం భద్రాచలం నందు టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చేతుల మీదుగా చేయడం జరిగింది.

భద్రాచలం నేటి దాత్రి

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శి అమరనేని రామారావు, చైతన్య భార్గవ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు అన్నివేళలా ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని, తద్వారా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ విస్తృతస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేయడంలో ప్రధాన భూమిక ఉద్యోగులు పోషిస్తారని, అట్టి బాధ్యతను అన్నివేళలా ఉద్యోగులు నిర్వర్తించడం ఎంతో గర్వకారంగా ఉన్నదని తెలియజేశారు. ఈ సందర్భంగా సెక్రెటరీ గగ్గురి బాలకృష్ణ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా తెలంగాణను సాధించుకున్నామని, అట్టి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడంలో ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు అహర్నిశలు పాటుపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు గాంధీ లింగమూర్తి కృష్ణ శ్రీనివాస్ రెడ్డి మబ్బు ప్రసాద్ రామారావు అపర్ణ అంజిబాబు క్రాంతి పుల్లారావు పాపారావు పాషా శంకర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.*

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version