-రెండు చోట్ల నిలుపుకున్న ప్రభుత్వం.. బెంగాల్ బీజేపీకి అదనం.
-కాంగ్రెస్ హస్తగతమైన కేరళం.
-అనూహ్యంగా విజయ్ సంచలనం.
-ఇప్పట్లో బీజేపీని కొట్టుడు అన్ని పార్టీలకు కష్టమే!
-నేటిధాత్రి గత పదేళ్లుగా చెబుతున్నదే నిజమని తెలుతోంది.
-ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది నేటి ధాత్రి ముందే
చెప్పింది.
-ప్రత్యేకంగా టివికె సింగల్ లార్జెస్ట్ పార్టీ అని ముందే ఒక్క నేటిధాత్రి మాత్రమే
చెప్పింది
-బీజేపీ హాట్రిక్ ల మీద హాట్రిక్ లు కొడుతోంది.
-మళ్ళీ మళ్ళీ అన్ని రాష్ట్రాలలో గెలుస్తోంది.
-ఇటీవల కాలంలో అధికారం కోల్పోయిన రాష్టం ఒక్కటీ లేదు.
-ఉత్తరాదిలో బీజేపీ ని ఓడించడం అంత సులువు కాదు.
-కాంగ్రెస్ మైండ్ సెట్ మార్చుకోక పొతే గెలిచే ముచ్చటే కనిపించడం లేదు.
-కాలానికి అనుగుణంగా మారకపోతే కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు.
-హిందుత్వ నినాదం అందుకోక పొతే కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనిపించడం
లేదు.
-బీజేపీ బలంగా లేని చోట మాత్రమే కాంగ్రెస్ గెలుస్తోంది.
-ఇప్పటికైనా నిజాన్ని గ్రహించకపోతే కాంగ్రెస్ కు కష్టమే!
-దక్షణాదిలో బీజేపీ ఇంకా దూరడం లేదు.
-ఒక రకంగా సాధ్యం కావడం లేదు.
-ఉత్తరాధిలో కాంగ్రెస్ కు ఊపిరాడడం లేదు.
-అస్సాం లో బీజేపీ మళ్ళీ గెలిచింది.
-పుదుచేరిలోనూ మళ్ళీ కమలం వికసించింది.
-బెంగాల్ ను ఈ సారి కసితో పనిచేసి బీజేపీ దక్కించుకున్నది.
-ఆ కసి కాంగ్రెస్ లో ఎక్కడా కనిపించడం లేదు.
-ఏఐఏడిఎంకె రూపంలో తమిళనాడు లో బీజేపీ పాగా వేసినట్లే!
-కర్ణాటక లో అధికారం చేపట్టిందే.
`ఇక మిగిలింది తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లే మిగిలి వున్నాయి.
`బీజేపీ దేశమంతా బలపడితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగే!
`జమిలి కి ఇక బిజెపి సిద్ధమే నేటిధాత్రి ముందే చెప్పినట్టుగా 2027 లో
ఎన్నికలే
హైదరాబాద్, నేటిధాత్రి:
దేశంలో బిజేపి వరస విజయాలతో దూసుకుపోతోంది. ఏ ఎన్నికలు వచ్చినా విజయం సొంతం చేసకుంటోంది. చెప్పి మరీ గెలుస్తోంది. గెలుస్తామని సవాలు చేసి మరీ, అక్కడ పాగా వేస్తోంది. రాజకీయాలు మార్చేస్తోంది. అంతగా బిజేపిని ప్రజలు కోరుకుంటున్నారు. నాయకులను ఆదరిస్తున్నారు. గెలిపిస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో బిజేపి అది చేస్తోంది. బిజేపి ఏది అనుకుంటుందో అది జనం కూడా మెచ్చుకుంటున్నారు. అందుకే ఇలా వరుస విజయాలు బిజేపికి దాసోహమౌతున్నాయి. బిజేపి అదికారంలో వున్న ఏ రాష్ట్రంలోనూ రెండోసారి, మÖడో గెలుస్తున్నాయి. అలా గెలవడానికి ఎక్కడా పెద్దగా శ్రమటోడ్చాల్సిన అవసరం కనిపించడం లేదు. ఎంతో సునాయాసంగా గెలుస్తున్నారు. సహ్పుంగా ఏ రాష్ట్రంలో నైనా సరే ఒకసారి అదికారం చేపట్టిన పార్టీ, మరుసటి ఎన్నికల్లో ఓడిపోవడం జరుగుతుంది. లేకుంటే ఎంతో కొంత మెజార్టీ తగ్గిపోతుంది. కాని బిజేపి పాలించిన అన్ని రాష్ట్రాలలోనూ మెజార్టీ పెంచుకుంటూ వస్తోంది. అలా చూసుకుంటే బిజేపి గుజరాత్‌లో ఏకంగా వరుసగా ఏడు ఎన్నికల్లోనూ విజయం సాదిస్తూ వస్తోంది. అలా విజయాల పరపరంలో చాలా రాష్ట్రాలలో హాట్రిక్ విజయాలు సొంతంచేసుకుంటూ వస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, బిహార్, ఇలా చెప్ప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాలున్నాయి. ఇప్ప్పుడు తాజాగా కూడా రెండోసారి అస్సాంలో బిజేపి మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటీవలే జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇప్పటికే బిజేపి రెండు రాష్ట్రాలలో అధికారంలో వుంది. అస్సాంలో గత ఐదేళ్లలో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టింది. కాని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాని వారి మాటలు జనం ఎప్ప్పుడూ నమ్మలేదు. ఎన్నికల సమయంలోనే కాదు, ఇతర సమయాల్లో కూడా ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు కరువయ్యేది. అయినా ప్రతిపక్షంలో వున్నప్ప్పుడు ఏవో ఆరోపణలు చేయాలని చేసేవి. కాని ప్రజలు బిజేపి పక్కనే నిలిచారు. దాంతో అస్సాం ఎన్నికల ముందే ప్రతిపక్ష కాంగ్రెస్ చేతులెత్తేసిందని చెప్పక తప్పదు. అందుకే ప్రీ పోల్ సర్వేల్లోనూ, ఎగ్గిట్ ఫోల్ సర్వేలలోనూ అందరూ బిజేపికే జై కొట్టారు. అదే ఎన్నికల ఫలితమయ్యింది. మరో పుదిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఎన్డీయే గెలిచింది. ఇది కూడా అందరూ ముందు నుంచి ఊహిస్తూ వస్తున్నదే. అయితే అసలైన ట్విస్టు మాత్రం బెంగాల్‌లో జరిగింది. ముందు నుంచి ఈసారి బెంగాల్‌లో గెలుస్తామని బిజేపి చెబుతోంది. అందుకు గట్టిగా ప్రయత్నం చేస్తూ వచ్చింది. బెంగాల్ వరుసగా మÖడు సార్లు విజయం సాదించిన మమత బెనర్జీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అది బిజేపికి అనుకూలంగా మారింది. పైగా కేంద్ర ీVAం మంత్రి అమిత్‌షా ఎన్నికలు ముందు పదిహేను రోజులు అక్కడే మకాం వేశారు. గత రెండేళ్ల కాలంగా ఎక్కువగా బిజేపి బెంగాల్ మీద ఫోకస్‌చేసింది. ఎలాగైనా ఈసారి బెంగాల్‌లో గెలవాలన్న పట్టుదలతో సాగింది. బిజేపి గెలిస్తే బెంగాల్‌కు ఏం చేస్తామనే విషయాలను బిజేపి స్పష్టంగా కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. ప్రజలు బిజేపిని విశ్వసించారు. ఎలాగూ ఓడిపోయే పరిస్దితులు కనిపిస్తున్నాయని అనుకున్న తృణమÖల్ అధినేత్రి మమత బెనర్జీ అడుగడుగునా బిజేపిని అడ్డుకుంటూ వచ్చింది. ప్రతి సందర్భాన్ని విమర్శిస్తూ రాజకీయం చేసింది. అయినా బిజేపి తాను ఏం చేయాలనుకున్నదో అదే చేసుకుంటూ వెళ్లింది. ప్రజలు కూడా బిజేపి చేస్తున్న ప్రతి పనిని సమర్ధిస్తూ వచ్చారు. తీరా ఎన్నికల సమయంలో బిజేపిని ఆశీర్వదించారు. ఈ ఎన్నికల్లో అసలు విజయం అంటే బెంగాల్‌లోనే, అది బిజేపి ప్రజలిచ్చిన గొప్ప కానుకగా చెప్ప్పుకోవచ్చు. బిజేపిని రానికవ్వకపోవడమే రాజకీయం అనేలా మమత బెనర్జీ రాజకీయం చేస్తూ, పాలన గాలికి వదిలేశారు. తన పని తాను చేసుకుంటూ పోకుండా తన కాన్‌సంట్రేషన్ అంతా బిజేపి మీదనే పెట్టింది. దాంతో ప్రజలు కూడా మమత ప్పు్రల కోసం కాకుండా, రాజకీయం కోసమే వుందన్న ఆలోచన ప్రజలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓడించారు. కాని దాదాపు అన్ని సర్వే సంస్ధలు బిజేపి ఈసారి తృణమÖల్‌కు గట్టిపోటీ ఇస్తుందని రాశాయే గాని, బిజేపి గెలుస్తుందని చాలా తక్కువ సంస్ధలు చెప్పాయి. ప్రజల నాడిని అంచనా వేయడంలో ఇక్కడ కూడా సర్వే సంస్ధలు చాలా వరకు విఫలమయ్యాయి. ఇక మరో రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో కూడా సర్వే సంస్ధలు అన్నీ మళ్లీ డిఎంకేదే అదికారం అని రాస్తూ వచ్చాయి. కాని ఒకే ఒక్క సర్వే సంస్ధ డిప్యాక్, నేటిధాత్రి దిన పత్రిక మాత్రమే ముందు నుంచి విజయ్ గెలుసు ఖాయమని చెబుతూ వచ్చింది. ఎన్నికల సమయంలోనూ ఒకే ఒక్క పత్రిక నేటిధాత్రి మాత్రమే ఈసారి విజయ్‌దే విజయం అనిచెప్పింది. సింగిల్ లార్జెస్టు పార్టీగా టివికే విజయం సాదిస్తుందని కూడా ముందే చెప్పిన ఏకైక సంస్ద నేటిధాత్రి. ఇక కేరళ విషయంలోనూ నేటిధాత్రి చెప్పిందే నూటికి నూరు పాళ్లు నిజమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాదిస్తుందని నేటిధాత్రి మాత్రమే చెప్పింది. ఖచ్చితంగా కాంగ్రెస్ వంద సీట్లకు పైగా సాధిస్తుందని చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. కాని ఏ సర్వే సంస్ధ ఇంత కచ్చితమైన లెక్కను చెప్పలేదు. ఎల్డీఎఫ్, యుడిఎఫ్‌ల మధ్య గట్టిపోటీ వుంటుందని మాత్రమే చెప్పాయి. కొన్ని సర్వే సంస్దలు యుడిఎఫ్ గెలుస్తుందని చెప్పాయే గాని, తక్కువ మార్జిన్‌తో మాత్రమే గెలుస్తాయని చెప్పడం జరిగింది. కాని ఒక్క నేటిధాత్రి మాత్రమే ఖచ్చితమైన లెక్క వేసి చెప్పడం జరిగింది. అదే నిజమైంది. సిఎంగా కేసి. వేణుగోపాల్ ను చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అది కూడా నిజమయ్యే ఛాన్సు వుంది. అయితే ఇక్కడ బిజేపి, కాంగ్రెస్‌లు మాత్రమే జాతీయ స్దాయిలో వుండాలన్న లక్ష్యంతోనే సాగుతున్నాయనేది అర్దమౌతున్నాయి. కాని ప్రజల నాడిని బట్టి కాంగ్రెస్ రాజకీయాలు చేయడం లేదన్న విషయం అర్దమౌతోంది. ప్రజలు కూడా పదే పదే బిజేపిని ఎందుకు గెలిపిస్తున్నారన్న దానిపై లోతైన విశ్లేషణ చేసుకోకుండా కాంగ్రెస్ వెనుకబడిపోతోంది. ప్రజలు హిందుత్వ భావజాలాన్ని పూర్తిగా నమ్ముతున్నారు. ప్రజల మధ్య కొన్ని దశాబ్దాలుగా బరి గీసి వున్న గీతను అర్దం చేసుకున్నది ఒక్క బిజేపి మాత్రమే అని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ విస్మరిస్తూ వస్తోంది. ప్రజలు అభివృద్ది, సంక్షేమమే కాదు, కొన్నిసార్లు ఆత్మగౌరవం కూడా కోరుకుంటారు. అలాంటి ఆత్మగౌరవాన్ని కేవలం ఎన్నికల కోసం కాంగ్రెస్ తాకట్టుపెట్టిందన్న విమర్శలు కాంగ్రెస్ చాలా కాలం నుంచి ఎదుర్కొంటోంది. అయినా ఆ పార్టీ తేరుకోలేకపోయింది. ఎన్నికల్లో గెలవడం కోసం మైనార్టీ ఓట్లను కాంగ్రెస్ నమ్ముకున్నది. మైనార్టీ ఓట్లు గుండుగుత్తగా పడితే చాలు గెలుస్తామని భావిస్తూవచ్చింది. కాని బిజేపి మెజార్టీ ఓట్లను రాబడుతూ విజయం సాదిస్తోంది. దానిని ఇంకా కాంగ్రెస్ అర్దం చేసుకోలేకపోతోంది. బిజేపికి కేవలం మత రాజకీయం అనే ఆరోపణల దగ్గరే కాంగ్రెస్ ఆగిపోతోంది. అందుకే ఓడిపోతోంది. అయినా కాంగ్రెస్ అంతర్మరధనం చేసుకోవడం లేదు. ప్రజల నాడిని పట్టుకొని రాజకీయాలు చేయాల్సిన పార్టీలు, తమ సిద్దాంతాలు, రాద్దాంతాల కోసం ఓట్లు వేయమంటే వేయరు అనే సత్యాన్ని కాంగ్రెస్ గ్రహించడం లేదు. ప్రజల మధ్య కొన్ని గీతలు అలాగే వున్నాయి. వాటిని అవతలి వ్యక్తులు చెరిపేసుకోవాలన్న ఆలోచనతో లేరు. కాని మరో సమాజమే గీతలను చెరిపేసుకొని తమతో కలిసి సాగాలని కోరుకుంటున్నారు. ఇది మెజార్టీ సమాజం అంగీకరించదు. ఆ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పటికీ మÖడు కేంద్ర ఎన్నికల సమయంలోనూ, అనేక రాష్ట్రాల గెలుపుల్లోనూ స్పష్టంగా ప్రజా తీర్పుతో చెబుతున్నారు. కాని కాంగ్రెస్ దాని గురించి పట్టించుకోవడం లేదు. లౌకిక ప్రజాస్వామ్యమంటే కేవలం హిందూ సమాజమే అన్ని త్యాగాలు చేయాలని ఎక్కడా లేదు. ప్రతి సందర్భంలోనూ మైనార్టీ ప్రజల బాగోగులు మాత్రమే కొన్ని పార్టీలు పదే పదే స్మరిస్తుంటాయి. మెజార్టీ జనాభా మనోభావాలను కాంగ్రెస్ గుర్తించలేదు. అందుకే బిజేపి వైపు ప్రజలు చూస్తున్నారు. బిజేపి మాత్రమే మెజార్టీ ప్రజల మనోభావాలను కాపాడుతుందని నమ్ముతున్నారు. అందుకే బిజేపిని ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారు. ఒక్కసారి గెలిచిన తర్వాత ఎక్కడా బిజేపి ఓడిపోవడం లేదు. ఇది ప్రజల కోణంలో సాగుతున్న పార్టీగా గుర్తింపు పొందుతోంది. అందుకే బిజేపి వరుస గెలుపులు తన ఖాతాలో వేసుకుంటోంది.