అంబేద్కర్ విగ్రహానికి వినతి
నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి జిల్లాలో జరిగిన బిసి డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరకాలం పూర్తయిన బీసీ సబ్ ప్లాన్ పై ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడం అంటే ఇది బీసీలను మభ్యపెట్టడమే అవుతుందని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు పై ప్రభుత్వము ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని,లేనిపక్షంలో దశాల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిసి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మల శ్రీనివాస్,రాష్ట్ర కార్యదర్శి అక్కల రమేష్,బీసీ సీనియర్ నాయకులు శాఖ పురి భీమెన్స్,యాదవబోయిన రాజన్న యాదవ్,గోలి వాడ వంశీ,షేక్ సల్మాన్,ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.