-మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి
మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్
పోలియో రహిత సమాజమే లక్ష్యంగా మనమందరం పనిచేద్దామని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి అన్నారు. శుక్రవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి అధ్యక్షతన మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో టాస్క్ ఫోర్స్ మండల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పోరండ్ల నాగరాణి మాట్లాడారు. మండలంలో 3341 మంది పిల్లలు 5 సంవత్సరంల వాళ్లు ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేయడానికి మార్చి 3న 28 బూతులు మండల వ్యాప్తంగా నాలుగు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా 4,5 తేదీలలో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి పోలియో చుక్కలు వేసుకోని పిల్లలను గుర్తించి వారికి కూడా పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ, తహసిల్దార్ సునీత, ఎంఈఓ ప్రభాకర్, పల్లె దావకాన వైద్యాధికారులు డాక్టర్ సంధ్య, డాక్టర్ రాణి, డాక్టర్ యాస్మిని, డాక్టర్ సరళ, డాక్టర్ విద్యాసాగర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటస్వామి, సూపర్వైజర్ సునీత, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.