హత్నూర మండల దివ్యాంగులకై దిక్సూచి యాత్ర

– స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు….

– బివి శివశంకర్ రావు…

కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:-

దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గానికి సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరో బృహత్తర కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది.దివ్యాంగుల సదరం క్యాంపు దరఖాస్తు స్వీకరణకై దివ్యాంగులకై దిక్సూచి యాత్ర పేరుతో మీ ఇంటింటికి వచ్చి నేరుగా మీ ధ్రువ పత్రాల స్వీకరణ కార్యక్రమం చేపడుతున్నాం.
ఏండ్ల తరబడి దివ్యాంగులుగా ఉంటూ సదరం క్యాంపు కొరకు మీ సేవలో స్లాట్ బుక్ అవ్వక ఎన్నో వందలసార్లు మీ సేవ చుట్టూ తిరుగుతున్న హత్నూర మండలం దివ్యాంగుల కొరకు. సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ శాశ్వత పరిష్కారం చూపే బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకుంది. ఇకనుండి హత్నూర మండలంలోని ఏఒక్క దివ్యాంగులు మీసేవ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అర్హులైన దివ్యాంగుల ఇంటికి వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలు తీసుకొని ఉచితంగా మీ సేవలో స్లాట్ బుక్ చేయించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సదరం క్యాంపుకు తీసుకెళ్లి సర్టిఫికెట్ మంజూరు చేయించే పూర్తి బాధ్యత సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తీసుకుంటుంది. ఈనెల తేదీ:04.03.2024 నుండి13.03.2024 వరకు 10 రోజులపాటు రోజుకు 4 గ్రామాల చొప్పున మండలంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ధ్రువపత్రాలు తీసుకుంటారు. అర్హులైన దివ్యాంగులు ఈ 99897 78881 నంబరుకు సంప్రదించగలరని బి వి శివశంకరరావు  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *