ఆలయంలోకి దళితులు ప్రవేశించకుండా గేటుకు తాళం

ఆలస్యంగా వెలుగులోకి

కుల వివక్ష చూపిన ఆలయ పూజారి..

పూజారి పై కేసు నమోదు చేయాలని కుల సంఘాల నాయకులు..

ఇప్పటికీ ఆ గ్రామంలో అదే తంతు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం, కులతత్వం వంటి సమస్యలు ఇప్పటికీ సర్వసాధారణం. కులతత్వం యొక్క లోతుగా పాతుకుపోయిన సంప్రదాయాలే దీనికి కారణం. పెద్దలే కాదు, పిల్లలు కూడా ఇలాంటి వివక్షకు గురవుతున్నారు. సమాజంలో, పాఠశాలల్లో లేదా ఆట స్థలంలో అయినా, కుల వివక్ష కారణంగా చాలా మంది పిల్లలు అవమానాలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో, షెడ్యూల్ కులాల పిల్లలను విడివిడిగా కూర్చుని తినమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి; షెడ్యూల్డ్ కులాల బాలికలు పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేయాలని కోరారు; మరియు ఉపాధ్యాయులు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన పిల్లలను తరగతిలో వెనుకవైపు కూర్చోమని కోరారు.
కానీ

ఉన్నత పదవిలో వున్నా… కులం పేరుతో, అవమానాలకు గురయ్యారా? మీ కులం వారికి ఇల్లు అద్దెకివ్వం అనే సమాధానం ఎప్పుడైనా విన్నారా?ఒక్కసారైనా హోటల్‌లో టీ తాగి, మీ గ్లాసు మీరే కడుక్కున్నారా? రంగును బట్టి జాతి వివక్షను ఎదుర్కొన్నారా? మతం పేరుతో దాడులకు గురయ్యారా?’

అంటే- జిల్లా వ్యాప్తంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం మంది అణచివేతకు, వివక్షకు గురవుతున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినా వందల యేళ్ల నుంచి దళితులు, బహుజనులు అంటరాని మంటల్లో కాలుతూ, ఊరి పొలిమేరల్లోనే జీవనం సాగిస్తున్నారు. సమతా మమతలు అంతుచిక్కని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దళితులు హింసించబడుతూనే వున్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః’ అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో, అక్కడ దేవతలు నివసిస్తారని అర్థం. కానీ నేడు స్త్రీలు అనేక రకాల వివక్షలకు గురవుతున్నారు. ఇది పూర్తిగా అంతం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మార్చి 1వ తేదీ ‘జీరో డిస్క్రిమిమేషన్‌ డే’. వివక్షకు వ్యతిరేకంగా నిలబడే రోజు.
ఆధునిక కాలంలోనూ కుల, మత, జాతి, లింగ, ప్రాంత, వివక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో కుల, మత, ప్రాంత వివక్ష తీవ్రత ఎక్కువైంది. రెండు గ్లాసుల విధానం, దళితులకి ఆలయ ప్రవేశం వంటి వివక్ష నేటికీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది వాస్తవం. వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 19 కిలోమీటర్ల దూరంలోవున్నా యన్మన్ గండ్ల గ్రామంలో దళితులు ఆలయానికి వెళ్లాలంటే.. వారికి కేటాయించిన సమయంలో మాత్రమే ఆలయానికి వెళ్లాలని. మిగతా సమయంలో వారు ఆలయానికి వెళ్ళకూడదని ఇప్పటికీ ఆ గ్రామంలో నిబంధనలను వర్తిస్తున్నాయి. దళిత జాతికి యువకుడు తన కూతురి పుట్టినరోజు సందర్భంగా పూజ చేయిద్దామని ఆలయానికి వెళ్ళాడు అప్పటికే తాళం వేసి వెళ్లిపోయిన పూజారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా నేను ఉంట్టేనే ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని లేదంటే గేటు తాళం ఎవరికి ఇవ్వకూడదని పొంతన లేని సమాధానం ఇచ్చాడు. అతని మనోభావాలను దెబ్బ తినేలా మాట్లాడిన పూజారి గుడి తాళాలు ఇవ్వకపోవడంతో ఆ యువకుడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆలయంలోకి వెళ్లి పూజ చేయించాడు.ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో అనేకం కనిపిస్తాయి. దళితులు, గిరిజనుల పట్ల వారి ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, తిండి, చదువు, ఉద్యోగాల్లో వివక్ష అనేక రూపాల్లో వ్యక్తమౌతూనే వుంది.
అలాగే.. ఈ రోజుకీ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినా.. మానవ విలువలను కోల్పోతున్న పరిస్థితిని నేడు చూస్తున్నాం. ‘కులం పునాదుల మీద ఒక జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేం’ అంటారు అంబేద్కర్‌. మనదేశంలో వేళ్లూనుకుని వున్న కులం సమాజాభివృద్ధికి ఆటంకంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులు ఉన్న మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండటానికి ప్రధాన కారణం- ఆర్థిక అసమానతలు, దేశంలో 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఆధిపత్య కులాల అణచివేత. మనదేశంలో ఒక శాతం సంపన్నులు జాతీయ ఆదాయంలో 22 శాతం కలిగి ఉండగా, 50 శాతంపైగా వున్న పేదలు 13 శాతం మాత్రమే కలిగి ఉన్నారని వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ నివేదిక అంచనా వేసింది.కులం

కుల వివక్ష గురించి చట్టం ఏం చెబుతోంది
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం, చట్టం ముందు ఏ వ్యక్తికి సమానత్వాన్ని లేదా భారత భూభాగంలోని చట్టాల సమాన రక్షణను రాష్ట్రం తిరస్కరించదు. ఆర్టికల్ 15 ఏ మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం లేదా వాటిలో దేనినైనా ఏ పౌరుడిని అయినా వివక్ష చూపకుండా రాష్ట్రాన్ని నిషేధిస్తుంది.

ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలించబడిందని మరియు దానిని ఏ రూపంలోనైనా ఆచరించడం నిషేధించబడిందని పేర్కొంది. ‘అంటరానితనం’ ప్రబోధం మరియు ఆచరించడం మరియు దానితో సంబంధం ఉన్న ఏదైనా అంశం కోసం శిక్షను అందించడానికి అమలులోకి వచ్చిన మొదటి భారతీయ చట్టం ‘పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1955’. 1989లో, భారత ప్రభుత్వం ‘షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీల నిరోధక) చట్టం’ని అమలులోకి తెచ్చింది, ఇది షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలపై నాన్-షెడ్యూల్ కులాలు మరియు నాన్-షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలపై విధించే వివిధ రకాల హింస మరియు వివక్షలను గుర్తించింది. షెడ్యూల్డ్ తెగలు శిక్షార్హమైన నేరాలు. ఈ చట్టం కింద నేరాలను విచారించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కూడా ఇది అందిస్తుంది.
సమాజంలో అనాదిగా రకరకాల వివక్షలు కొనసాగుతున్నాయి.
ఆలయానికి తాళం వేసి వెళ్లిన పూజారిపై చెట్టరీత్యా చర్య తీసుకోవాలని జిల్లాలోని కుల సంఘాలు మొండి పడుతున్నాయి. లేకపోతే మండలంలోని దళితులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!