సంక్రాంతి పండుగ తెచ్చిన సంబరాలు ఎన్నో.
సంక్రాంతి బొబ్బెమ్మ లతో,మురిసిపోనున్న ముంగిట్లు.
గోదా కళ్యాణం రాజ భోగ్య ల తో కన్నుల పండుగగా నిర్వహించే సంక్రాంతి.
పశు సంపదను ఆరాధించే రోజు కనుమ
రేపటి నుండి ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు పై పాఠకుల కోసం నేటి ధాత్రి ప్రత్యేక కథనం.
మహాదేవపూర్-నేటిధాత్రి
హేమంత ఋతువులో 30 రోజులపాటు పాశురము చేస్తూ గోదా కళ్యాణం చేసి రాజభోగాలు పిండి వంటలు చేసి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం తో పాటు కృషి పరులైన రైతులు ధాన్య రాశులు ముంగిట్లో పొడిగిస్తే వేళ ఒకవైపు అన్నదాతల పండుగ సంక్రాత్రి అని కూడా అంటారు. మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా ఆచార సాంప్రదాయాల తో గోదా కళ్యాణాలు చేసి భోగి మకర సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న మకర సంక్రాంతి వేడుకలను ఈరోజు మండలంలోని ని గ్రామాల ప్రజలు ఘనంగా నిర్వహించుకొనున్నారు. సంక్రాంతి సంబరాలకు సంబంధించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు భోగి నుండి మొదలుకొని కనుమ హారతి సమాప్తం కావడం జరుగుతుంది. సోమవారం రోజు నుండి సంక్రాంతి భోగి పండుగ ప్రారంభమై బుధవారం కనుమతో ముగియనుంది. ఇక సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి మండలం తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ ఇండ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించుకోవడం జరిగింది. మరోవైపు మండలం తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం కాలేశ్వరం ,వేములవాడ రాజరాజేశ్వర, ఆలయాలు సంక్రాంతి ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సిద్ధం కావడం జరిగింది.
హేమంత రుతువు తెలుగువారి పెద్ద పండుగ నేడే మకర సంక్రాంతి.
పోతాన మాత్యుడు భాగవత కావ్యం హేమంతంలో వివరించిన కావ్యం,” అహము సన్నమూ అయ్యను ధనముహితమయ్యే దీర్ఘడిశెలయ్యే నిషీల్ బహు షితోపాతంబై,బహుమనివాడకే లోకమురవినాధ” తెలపడం జరిగింది అలాగే పోతనామాత్యుడు హేమంత ఋతువు మరింత వివరిస్తూ పొడవు కొండమీద పొడుచుట మొదలు తో బరువు లెట్టి యునుడు పశ్చిమాద్రి మారుగుజాన్నేగాక అని చలి తాకిడి నుండి తప్పించుకునేందుకు సూర్యుడు పరుగులు పెట్టి పడమటి కొండల్లో దాక్కున్నాడని వివరించడం జరిగింది. హేమంతపు ఋతువు చలి దాటి సూర్యుడు ని భయ పెట్టించిన వేళ వచ్చి హేమంత ఋతువులో మానవాళి చలి మంటలు భోగి మంటల మధ్య వ్యత్యాసం కలిగి ఉండడం భోగిమంటలతో సంక్రాంతి ముందు రోజు జరుపుకున్న భోగి పండుగ అనంతరం కన్నుల పండుగగా నిర్వహించుకునే మకర సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ.
గోదా కళ్యాణం రాజ భోగ్య ల తో కన్నుల పండుగగా నిర్వహించే సంక్రాంతి.
30 రోజులపాటు పాశురం చేసి సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి సందర్భంగా గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవాలను మండలంలోని ప్రధాన ఆలయాల్లో నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పర్వదినం రోజున గోదావరి పుణ్య స్నానాలను ఆచరించడం జరుగుతుంది. సంక్రాంతి పర్వదినం రోజున ప్రత్యేక నోము నోచుకుని బొబ్బెమ్మ లను వాకిట్ల లో కొలువు తీరడం తో పాటు పర్వదినం సంక్రాంతి కావడంతో కొత్త అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించడం బంధువులు మిత్రులతో విందు భోజనాలు ఆరగించడం దిద్దు వెన్నె గడ్డపెరుగు చెరుకు రసం తో ఒక వైపు ఆధ్యాత్మిక మరోవైపు సాంప్రదాయాల బద్ధంగా సంక్రాంతి సంబరాలను చేసుకోవడం జరుగుతుంది.
సంక్రాంతి పండుగ తెచ్చిన సంబరాలు ఎన్నో.
భోగి నుండి ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రుల మధ్య, పేకాటల సందళ్లు ఒకవైపు కోలాహలంగా కొన సాగుతుంటే, మరోవైపు కవి సమ్మేళనాల వంటి సాహితీ కార్యక్రమాలు కూడా సందడిగా జరుగుతుంటాయి. సంక్రాంతి కర్షకుల పండుగే కాదు, కవుల పండుగ కూడా! సంక్రాంతి నాటికి ధాన్యరాశులే కాదు, కవనరాశులు కూడా తెలుగునేల మీద భారీగానే పోగుపడతాయి.ఆధునికుల్లో జంటకవులైన పింగళి–కాటూరి ‘దినకరుడు శాంతుడై తోచె దినములింత కురుచలయ్యెను జలిగాలి చురుకు హెచ్చ.. మన గృహమ్ముల ధాన్య సంపదల నిల్పి సరస మధురమ్ము పుష్యమాసమ్ము వచ్చె”అంటూ ‘తొలకరి’ కావ్యంలో పుష్య సౌభాగ్యాన్ని వర్ణించారు. వీరు ఇదే కావ్యంలో సంక్రాంతి వేడుకలను వర్ణిస్తూ, రండు మాయింటి కీరు పేరంటమునకు బొమ్మలెత్తును మా పిల్లయమ్మలార’ అంటూ సంక్రాంతి బొమ్మల కొలువుల వేడుకను ప్రస్తావించారు. దసరాకే కాదు, కొన్నిప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టడమూ ఆనవాయితీ. సంక్రాంతి బొమ్మల కొలువుల్లో ప్రధాన దైవం సంక్రాంతి పురుషుడు. సంక్రాంతి పురుషుణ్ణే సంకురమయ్య అని పిలుచుకుంటారు. కాలపురుషుడే సంక్రాంతి పురుషుడిగా మకర సంక్రాంతినాడు భూమిపైకి దిగివచ్చి, భూలోక వాసులను పరిపాలిస్తాడని ఒక నమ్మకం ఉండడంతో ఎంతో ఆధ్యాత్మికంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది.
సంక్రాంతి బొబ్బెమ్మ లతో,మురిసిపోతున్న ముంగిట్లు
సంక్రాంతి రైతుల పండుగే కాదు, ముదితల పండుగ, అని కూడా అంటారు. ముగ్గుల పండుగ కూడా ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి వీధుల్లో ప్రతి ముంగిటా ముగ్గులు కళకళలాడుతూ కనిపిస్తాయి. ముగ్గులు ప్రాచీన కళారూపాలు. కామశాస్త్రం ప్రస్తావించిన అరవైనాలుగు కళల జాబితాలో ముగ్గులు వేయడం కూడా ఒక కళ. తెలుగు కవిత్వంలో ముగ్గుల ప్రస్తావన నన్నయ నాటి నుంచే ఉంది. పాండవులు వారణావతంలోని లక్క ఇంటికి వెళుతున్నప్పుడు వారణావత పుర ప్రజలు వారికి భారీగా స్వాగతం పలికారట. స్వాగత మర్యాదల్లో భాగంగా ఇంటింటా ముంగిళ్లలో ముగ్గులు తీర్చిదిద్దారట. ఆ ఘట్టంలోనే నన్నయ ‘అంగుళల నొప్పె కర్పూర రంగవల్లులు.అంటూ ముచ్చటైన పద్యం రాశాడు. ‘పలనాటి వీరచరిత్ర’లో కవిసార్వభౌముడు శ్రీనాథుడూ ముగ్గు ముచ్చట్లు వివరించడం జరిగిందని తెలుపుతారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా సంబరాల లోని ఒక ప్రధాన భాగమైన టువంటి గొబ్బెమ్మ ముగ్గులు మకర సంక్రాంతి లో ఒకవైపు ఆధ్యాత్మికం మరోవైపు భక్తుల భూముల కోరికను ముగ్గుల తోనే హరివిల్లు తాయని సంక్రాంతి ప్రారంభమైనప్పటి నుండి ఆడపడుచులు ముగ్గులు అలంకరణతో గొబ్బెమ్మలు పెట్టి కురవడం ముంగిళ్లలో ముగ్గులతో యావత్ మండలం లోని గ్రామాల్లో ఇండ్ల ముందు మహిళలు పేర్చిన ముగ్గులతో ఆ ముంగిళ్లు కళకళలాడుతుంటాయి.
పశు సంపదను ఆరాధించే రోజు కనుమ
కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.సంక్రాంతి వరసలో మంగళవారం రోజున జరుపుకుని చివరి పండగను కనుమ పండగ జరుపుకోవడం జరుగుతుంది. దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు.ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే ముగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ.పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి.
మంగళవారం రోజు రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం.ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. అనంతరం వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలివేయటం ఆనవాయితీ.సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేయడం జరుగుతుంది అలాగే”పొలి”ని తోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో,చెరువుల్లో, బావుల్లో “పొలో…. పొలి” అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడా మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును పెట్టిన బుక్కులు చెల్లించి మొక్కుకున్న అనంతరం సంక్రాంతి చివరి పండుగ కనుమ సమాప్తం కావడం జరుగుతుంది. ఇలా ప్రజల జీవితాల్లో రంగుల ఆనందాలు వెదజల్లే పండుగ చివరికి మూగజీవుల్లో కూడా ఆనందాన్ని నింపడం సంక్రాంతి యొక్క విశిష్టత.