ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
సమస్య ఏదైనా నా దృష్టికి తెస్తే పరిష్కారిస్తా..
ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందిస్తా..
ఈ కళాశాలను రాష్ట్రంలోనే రోల్మాడల్ గా తయారు చేద్దాం..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శుక్రవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారధ్యంలో విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తుందన్నారు. ఇంటర్ విద్య మన భవిష్యత్తుకు పునాది వేసి మన భవిష్యత్తు గమనాన్ని నిర్ణయించే సమయమని ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకోవచ్చు అని , చెడు అలవాట్లకు, చెడు స్నేహితులకు దూరంగా ఉంటూ మీ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఏదైనా జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
ఎమ్మెల్యే విద్యార్థులతో మమేకమై వారి లక్ష్యాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కళాశాల నుంచి డాక్టర్లుగా , ఇంజనీర్లు గా తయారు చేయడానికి కృషి చేయాలని ఆయన అధ్యాపకులకు సూచించారు. కావాల్సిన మెటీరియల్స్ ను అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు. రానున్న ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అందరూ కలిసి ఈ కళాశాల కు పేరు ప్రతిష్టలు తేవాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంతాచారి, ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, లెక్చరర్స్ నర్సింహ్మారెడ్డి, నండూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు