భద్రాచలం నేటి ధాత్రి
స్థానిక సుభాష్ నగర్ కాలనీ నందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఈటె అశోక్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశము ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా మాదిగ పెరియార్ పాల్గొని మాట్లాడుతూ పేదల గొంతుక,అభినవ అంబేద్కర్, మహాజన నేత మందకృష్ణ మాదిగ అన్న గత 30 సంవత్సరాల నుండి షెడ్యూల్ కులాల వర్గీకరణ లక్ష్యాసాధనకైఅలుపెరుగనిపోరాటం చేస్తున్నారని, పేదప్రజల హక్కులు, సమాన అవకాశాలు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం, ఒకరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాలని ప్రభుత్వాలతో యుద్ధం చేసి సాధించిపెట్టిన ఘనత మందకృష్ణ మాదిగ అన్నకే దక్కుతుంది అని గుర్తు చేశారు. జూలై 07నMRPS 30 సంవత్సరాల ఆవిర్భావం సందర్బంగా వరంగల్ కేంద్రం గా జరుగు ఆత్మగౌరవ ఖవాతును విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం లోని విద్యార్థుల, యువత, నిరుద్యోగులు, మహిళ లు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఖవాతుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ సమావేశంలో మహాజన మహిళా సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మేకల లత, జిల్లా అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క, ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి, ఎమ్మార్పీఎస్ పట్టణ నాయకులు మంద నరేష్ మాదిగ, వల్లే పాక వెంకట కృష్ణ మాదిగ, గ్రామ కమిటీ సభ్యులు చింత శ్రీకాంత్, గడ్డం ప్రతాప్, వంకపాటి ప్రసాద్, కొవ్వల రమేష్, మజ్జురి కన్నారావు, వల్లేపాక వంశీ, చింత రాంబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు