వేములవాడ రురల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండల పరిధిలోని గ్రామాలకు
ఎల్లంపల్లి నీళ్లు వస్తాయని ఆశతో బావులు బోరు బావుల్లో సరిపడా నీళ్లు లేనప్పటికీ వరి సాగు చేయడంతో పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఎన్నో ఆశలతో సేద్యం చేసిన రైతుల కళ్ళలో పంటలను కాపాడుకోవడం ఎలా అని నిస్సహాయత నెలకొంది సాగైనా పంటలకు నీళ్లు అందక పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా రావని గుబులు అన్నదాతల్లో నెలకొంది వేములవాడ రూరల్ మండలాల్లో యాసంగిలో వరి పంట సాగు చేసిన రైతులు పడుతున్న ఇబ్బందులపై
నేటిధాత్రి ప్రత్యేక కథనం
వేములవాడ రూరల్ మండలంలోని నూకలమర్రి చెక్కపల్లి ఎదురుగట్ల మర్రిపల్లి పలు గ్రామాల్లో దాదాపుగా 300 ఎకరాల్లో నీటి కొరత ఏర్పడింది వారం పది రోజులయ్యే నాటికి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు మరో వారం పది రోజుల్లో నీరందకపోతే పూర్తిగా ఎండిపోతాయేమోనని రైతుల్లో దిగులు పట్టుకుంది
వారం రోజుల్లో ఎత్తిపోస్తేనే…
వేములవాడ రూరల్ మండలంలోని నూకలమర్రి చెక్కపల్లి ఎదురుగట్ల మర్రిపల్లి గ్రామాల వ్యవసాయ భూముల నుంచి వెళ్లే ఎల్లంపల్లి కాలువ నీటిని విడుదల చేస్తే కాలువ పరిసర ప్రాంత రైతులు మోటార్లను ఏర్పాటు చేసుకొని కొందరు మరికొందరు నీటిని పంటలకు మళ్లించి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది ఇటీవల నీటిని విడుదల చేసిన అధికారులు రైతుల కు ఆశ చూపి వెనుతిరిగరు పంట చేతికందే సమయంలో పంట పొలాలు ఎండిపోవడంతో రైతుల గుండెలు పగులుతున్నాయి చెరువులను నమ్ముకొని వరి పంటలు సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు కాల్వల ద్వారా నీటిని సరఫరా చేయకుండా అధికారులు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు దీంతో వరి పంటలు సాగు చేసిన రైతులకు పంట చేతికందే సమయానికి నీళ్లు అందగా పంటలన్నీ ఎండిపోతున్నాయి దీంతో ఏం చేయాలో తెలియక రైతులు వరి పంటలను పశువుల మెతకు ఉపయోగిస్తున్నారు పంట సాగుకు చేసిన పెట్టుబడులు మీద పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు